Site icon HashtagU Telugu

Maihar Road Accident: మధ్యప్రదేశ్‌లో బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి

Maihar Road Accident

Maihar Road Accident

Maihar Road Accident: మధ్యప్రదేశ్‌లోని మైహార్‌లో బస్సు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో 6 మంది మృతి చెందగా, 20 మంది గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో నదన్ దేహత్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ప్రయాగ్‌రాజ్‌ నుంచి నాగ్‌పూర్‌ వెళ్తున్న బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న రాళ్లతో కూడిన డంపర్‌ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని మైహార్ ఎస్పీ సుధీర్ అగర్వాల్ తెలిపారు. మెరుగైన చికిత్స కోసం సత్నాకు రిఫర్ చేశారు.

మరికొందరు క్షతగాత్రులు మైహర్‌, అమర్‌పతన్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం చాలా తీవ్రంగా ఉందని, బస్సు ముందు భాగం బాగా దెబ్బతిందని తెలిపారు. “స్లీపర్ బస్సు ప్రయాగ్‌రాజ్ నుండి నాగ్‌పూర్‌కు వెళుతోంది. రాళ్లతో నిండిన ట్రక్కును ఢీకొట్టింది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

Also Read: SpaceX Rescue Mission: సునీతా విలియమ్స్ మరియు టీం కోసం రెస్క్యూ మిషన్‌ ప్రారంభం