Site icon HashtagU Telugu

Crime:మహారాష్ట్రలో కలకలం.. ఒకే ఇంట్లో 9 మృత దేహాలు!

Crime

Crime

ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ప్రాణాల మీదికి వచ్చే ఘటనలు చాలా జరుగుతున్నాయి. ఆత్మహత్యలు, హత్యలు అంటూ ఎంతోమంది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. కొందరు తమ వ్యక్తిగత జీవితాలు బాగోలేక ఆత్మహత్యలు చేసుకుంటే.. మరికొందరు ప్రేమ విషయంలో, వైవాహిక విషయంలో హత్యలు చేస్తున్నారు. కొన్నిసార్లు ఒక్క కుటుంబమే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కూడా వచ్చాయి.

అలా చాలా మంది వ్యవసాయ కుటుంబాలే ఉండగా ఇక మరో కుటుంబం కూడా మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఒకే ఇంట్లో తొమ్మిది మృత దేహాలు లభ్యమవటం తో అక్కడ ఈ విషయం అందర్నీ కలకలం రేపింది. ఇక పోలీసులు వీరిని పరిశీలించగా వీరంతా ఆత్మహత్య చేసుకొని ఉంటారు అని పోలీసులు భావిస్తున్నారు.

ఇక ఇందులో ముగ్గురు మృతదేహాలు ఒకచోట ఉండగా.. మరో ఆరు మంది మృతదేహాలు ఇంట్లో పలు చోట్ల లో పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఇక వీరంతా విషం తాగి చనిపోయి ఉంటారు అని అనుకోగా.. ఈ మృతదేహాలను పోస్టుమార్టం కోసం సమీప వైద్యశాలకు తరలించారు. ఇక వీరి ఆత్మహత్యకు కారణం ఏంటి అని అసలు విషయం తెలియక పోగా.. పోస్టుమార్టం అనంతరం ఈ విషయం గురించి స్పష్టత రానుంది అని పోలీసులు తెలుపుతున్నారు.