Site icon HashtagU Telugu

Nimmala Ramanaidu : జ‌నం కొసం నిమ్మ‌ల సైకిల్ యాత్ర‌

Nimmala Cycle

Nimmala Cycle

పాల‌కొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడు ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై పోరాడుతున్నారు. గ‌త మూడేళ్లుగా ప్ర‌భుత్వంపై వివిధ రూపాల్లో నిమ్మ‌ల రామానాయుడు నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. తాజాగా టీడీపీ హాయాంలో క‌ట్టిన ఇళ్ల‌ను ల‌బ్ధిదారుల‌కు అందించాల‌ని ఆయ‌న పాల‌కొల్లు నుంచి అసెంబ్లీకి సైకిల్ యాత్ర చేప‌ట్టారు. అంత‌కు ముందు పేదల సొంతింటి కల నెరవేర్చడం కోసం తెలుగుదేశం హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను వారికి పంపిణీ చేయాలంటూ పాలకొల్లు మున్సిపల్ ఆఫీస్ వద్ద 36 గంటలుగా ఇంటి దీక్ష చేప‌ట్టారు. దీక్ష విర‌మ‌ణ అనంత‌రం ఆయ‌న ఈ సైకిల్ యాత్ర చేప‌ట్టారు. ల‌బ్ధిదారులంద‌రికీ ఇళ్ల‌ను ఉచితంగా స్వాధీనం చేయాల‌ని స్వాధీనం చేసేంత వ‌ర‌కు ఇంటి అద్దె ప్ర‌భుత్వ‌మే చెల్లించాల‌ని డిమాండ్ చేస్తూ ఆయ‌న సైకిల్ కు ప్లకార్డు క‌ట్టుకుని బ‌య‌ల్దేరారు. తక్ష‌ణం ల‌బ్ధిదారుల‌కు ఇళ్ల‌ను అందించాల‌ని ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడు డిమాండ్ చేశారు.

రంగులు కాదు మిగిలిన 10 శాతం పూర్తి చేసి ఇళ్ల‌ను అందించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఈ సైకిల్ యాత్ర అసెంబ్లీ స‌మావేశాలు నాటికి అమ‌రావ‌తి చేరుకోనున్న‌ట్లు ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడు తెలిపారు. వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లు గ‌డుస్తున్న 10 శాతం పూర్తి చేయ‌లేక‌పోయింద‌ని ఆయ‌న ఆరోపించారు. ఇళ్ల పంపిణీ చేయాల‌ని గతంలో అనేక విధాలుగా పోరాటం చేశామ‌ని ఆయ‌న గుర్తుచేశారు. టిడ్కో ఇళ్ల‌లో జ‌ర‌గాల్సిన 10శాతం ప‌నులు పూర్తి చేయ‌కుండా వైసీపీ రంగులు వేసుకుంటున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. ఇళ్ల స్థ‌లాలు కూడా ముంపుకు గురైయ్యే భూముల్లో ఇస్తున్నార‌ని ..ఆ ఇళ్ల స్థ‌లాలు పాల‌కొల్లు టౌన్ లో ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. చివ‌రి ఇళ్లు ల‌బ్ధిదారుడికి చేరేంత‌వ‌ర‌కు తన పోరాటం కొన‌సాగిస్తాన‌ని ఆయ‌న తెలిపారు.