Site icon HashtagU Telugu

Night Curfew in AP : సంక్రాంతి త‌రువాతే ఏపీలో నైట్ క‌ర్ఫ్యూ

Night Curfew

Night Curfew

ఏపీలో నైట్ క‌ర్ఫ్యూను సంక్రాంతి త‌రువాత పెట్టాల‌ని తాజాగా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. కరోనా కేసులు పెర‌గ‌డంతో ముందుగా అనుకున్న ప్ర‌కారం సోమ‌వారం నుంచి నైట్ క‌ర్ఫ్యూ ఉండాలి. కానీ, ప్ర‌జ‌ల సౌక‌ర్యార్థం సంక్రాంతి త‌రువాత ఆంక్ష‌లు అమ‌లు చేయాల‌ని తాజాగా ఆదేశించింది. కరోనా మరియు ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని అరికట్టడానికి ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. కర్ఫ్యూ పై ప్రభుత్వం తాజాగా కీలక మార్పు చేసింది. సంక్రాంతి పండుగ తర్వాత నుంచి రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయించింది. పండుగ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.