Nigeria: నైజీరియాలో ఓ చర్చిపై ఉగ్రవాదుల దాష్టికం…కాల్పుల్లో 50మంది మృతి..!!

నైజీరియాలో టెర్రరిస్టులు రెచ్చిపోయారు. ఓ చర్చిపై కాల్పులు, బాంబు దాడులతో తెగబడ్డారు. ఈ ఘటనలో 50మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు.

  • Written By:
  • Updated On - June 6, 2022 / 09:50 AM IST

నైజీరియాలో టెర్రరిస్టులు రెచ్చిపోయారు. ఓ చర్చిపై కాల్పులు, బాంబు దాడులతో తెగబడ్డారు. ఈ ఘటనలో 50మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. ఓండో రాష్ట్రంలోని సెయింట ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం కావడంతో ప్రార్థనల కోసం ప్రజలు పెద్దెత్తున తరలివచ్చారు. దీంతో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవల్సి వచ్చింది. మృతుల్లో ఎక్కువమంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. ఘటన తర్వాత చర్చి ప్రధాన ఫాస్టర్ ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు.

మృతదేహాలు, చెల్లాచెదురుగా పడిపోవడంతో చర్చి భీతావహంగా మారింది. ఈ దాడిలో ఎంతమంది మరణించారన్నది ఇంకా ప్రభుత్వం అధికారికంగా స్పష్టత ఇవ్వనప్పటికీ 50మందికి పైగానే ప్రాణాలు కోల్పోయినట్లు నైజీరియా లోయర్ లెజిస్టేట్ ఛాంబర్ సభ్యుడు తెలిపారు. ఈ ఘటనపై ఆదేశ అధ్యక్షుడు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నెదర్ ప్రాంతానికి చెందిన వారు మాత్రమే ఇలాంటి మారణహోమాన్ని స్రుష్టించగలవని అన్నారు. కాగా ఈ దాడికి సంబంధించి ఇప్పటివరకు ఏ సంస్థా బాధ్యత ప్రకటించలేదు. నైజీరియాలోఅత్యంత శాంతియుత రాష్ట్రాల్లో ఒకటిగా పేరుగాంచిన ఓండోలోఈ ఘటన జరిగడం ఆందోళన కలిగిస్తోంది.