Site icon HashtagU Telugu

Varalakshmi Sarathkumar : వరలక్ష్మి శరత్‌కుమార్‌‌ కు NIA నోటీసులు

Nia Notices To Varalakshmi Sarathkumar

Nia Notices To Varalakshmi Sarathkumar

సీనియర్ యాక్టర్ శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్‌కుమార్‌‌ (Varalakshmi Sarathkumar) కు కేరళ ఎన్‌ఐఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. కేరళలో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్‌ కేసుకు సంబంధించిన విచారణ కోసం ఆమెకు సమన్లు ఇచ్చారు. ఈ కేసులో వరలక్ష్మి మాజీ పీఏ ఆదిలింగం కీలక నిందితుడిగా ఉన్నాడు. అతడి వివరాలను సేకరించేందుకు వరలక్ష్మిని విచారణకు రావాలని ఆదేశించినట్లు తెలుస్తుంది.

కేరళలోని విళంజియం సమీపంలో ఇటీవల కాలంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఆ కేసులో ఆదిలింగంను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. డ్రగ్స్ సరఫరాతో వచ్చిన డబ్బులను అతడు సినిమాల్లో పెట్టుబడి పెట్టినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. ఈ కేసులో వరలక్ష్మి (Varalakshmi Sarathkumar) కి ఏమైనా సంబంధం ఉందా? గతంలో ఈమెకు ఆదిలింగం డ్రగ్స్ సరఫరా చేశాడా? అనే వివరాలను కూడా ఎన్‌ఐఏ రాబట్టే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం.

Also Read:  Delhi Woman Guard Rape : మహిళ సెక్యూరిటీ గార్డ్‌ ఫై అత్యాచారం