Site icon HashtagU Telugu

NIA : ఆ ఇద్దరి సమాచారం అందిస్తే భారీ రివార్డ్…!!

Dawood

Dawood

అండర్ వరల్డ్ డాన్, ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం, అతని అనుచరుడు చోటా షకీల్…పాకిస్తాన్ లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. వారు ఎక్కడున్నారనేది చెప్పినవారికి లేదంటే వారికి సంబంధించిన సమాచారం అందించినవారికి భారీగా రివార్డ్ ప్రకటించింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA. దావూద్ కు సమాచారం అందిస్తే..రూ. 25 లక్షలు, చోటా షకీల్ వివరాలు అందిస్తే రూ. 20లక్షల ఇస్తామని ప్రకటించింది. అనీస్ ఇబ్రహీం, జావెద్ చింకా, టైగర్ మెమన్ లపై కూడా రివార్డు ప్రకటించింది. వారికి సంబంధించిన సమాచారం అందిస్తే ఒకరికి 15లక్షల చొప్పున రివార్డు ప్రకటించింది.

దావూద్, ఇతరులంతా కూడా లష్కరే తోయిబా, జైషఏ మొహమ్మద్, ఆల్ ఖైదా వంటి అంతర్జాతీయ ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తున్నారని గతేడాది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ ప్రస్తావించింది. 1993లో ముంబై వరుస బాంబు పేలుళ్లకు పాల్పడిందని పేర్కొంది. ఈ పేలుళ్లలో 250కి పైగా అమాయకులు ప్రాణాలుకోల్పోయారని..విలువైన ఆస్తుల నష్టం జరిగిందని తెలిపింది.

Exit mobile version