Top News Today: ఫిబ్రవరి 8 ముఖ్యంశాలు

అమిత్ షా, జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమై పొత్తులపై చర్చించారు. చంద్రబాబుని ఎన్డీయేలో చేరాలని అమిత్ షా, జేపీ నడ్డా ఆహ్వానించినట్లు సమాచారం

Top News Today: ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు దేవినేని చంద్రశేఖర్ అనారోగ్యంతో కన్నుమూశారు. వారం రోజులుగా చంద్రశేఖర్ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో సీనియర్‌ జర్నలిస్ట్‌, వీక్షణం పత్రిక ఎడిటర్‌ ఎన్‌. వేణుగోపాల్‌ ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హిమాయత్‌నగర్‌లోని ఆయన ఇంట్లో అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

అమిత్ షా, జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమై పొత్తులపై చర్చించారు. చంద్రబాబుని ఎన్డీయేలో చేరాలని అమిత్ షా, జేపీ నడ్డా ఆహ్వానించినట్లు సమాచారం

సింగరేణిలో ఉద్యోగాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సింగరేణిలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామని ప్రకటించారు. దీంతో పాటు రానున్న 15 రోజుల్లో 15 వేల పోలీసుల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని వెల్లడించారు.

ఈ రోజుతో ఏపీ బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయి . నిత్యావసరాల ధరల పెరుగుదల, జగన్‌హమీలు, రైతు సమస్యలు వంటి అంశాలపై టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళనతో శాసన సభా సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి.

హైదరాబాద్‌ యూసుఫ్‌గూడలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. రాములు అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు.

ఈ రోజు నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 10న శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 12 నుండి వారం రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

వైఎస్ఆర్ మరణం నుంచి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి వరకూ వివిధ పరిణామాలపై తీసిన యాత్ర 2 సినిమా ఈ రోజు విడుదలైంది. అమెరికా, యూకేలోని పలు ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు పడ్డాయి. సినిమాలో ప్రతి సన్నివేశం గూస్‌బంప్స్ తెప్పిస్తుందంటున్నారు . ఈ చిత్రానికి 3 రేటింగ్ ఇస్తున్నారు.

కెమెరామెన్ గంగతో రాంబాబు రీ రిలీజ్ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అత్యుత్సాహం చూపించారు. జనసేన జెండాలు థియోటర్లోకి తీసుకొచ్చి నానా హంగామా చేశారు. స్క్రీన్ ముందు మంట పెట్టి దాని చుట్టూ డాన్సులు చేశారు.

అండర్‌ -19 పురుషుల ప్రపంచకప్‌లో యువ భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసి తుదిపోరుకు అర్హత సాధించింది.

రెండురోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం .58,010ల వద్ద, 24 క్యారెట్ల బంగారం 63,240 వద్దకు చేరింది. ఇక వెండి ధర కేజీపై 1000 తగ్గి 75,000 కి చేరింది.

Also Read: Telangana: మల్లారెడ్డి మహిళ హాస్టల్‌లో పురుగుల అన్నం