Site icon HashtagU Telugu

Nayan & Vignesh: వేంకటేశ్వరుడ్ని దర్శించుకున్న నయనతార దంపతులు!

Nayana

Nayana

కోలీవుడ్ లవబర్డ్స్ నయనతార, విఘ్నేష్ శివన్ తమిళనాడులో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉన్నా జంట పెళ్లితో ఒక్కటయ్యారు. నవ దంపతులు విఘ్నేశ్‌ శివన్‌, నయనతార తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన వీరు శుక్రవారం తిరుమల విచ్చేసి, శ్రీవారి కల్యాణోత్సవ సేవలో  పాల్గొన్నారు. మొక్కులు చెల్లించుకున్న అనంతరం వీరికి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కొందరు భక్తులు ఈ జంటను చూసేందుకు ఉత్సాహం చూపారు. నయనతార అభిమానులు ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు.