Site icon HashtagU Telugu

New Zealand: కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి!

Newzlond

Newzlond

2022 సంవత్సరానికి న్యూజిలాండ్​ ఘనంగా స్వాగతం పలికింది. మిరుమిట్లు గొలిపే విద్యుత్‌ దీప కాంతుల వెలుగుల్లో ఆక్లాండ్‌ నగరం మెరిసిపోయింది. కేరింతలు కొడుతూ, బాణసంచా కాల్చి ఆక్లాండ్​ నగర వాసులు సంబరాలు జరుపుకున్నారు.‍ ప్రఖ్యాత స్కైటవర్​పై బాణాసంచా పేలుళ్లు ఆకర్షణగా నిలిచాయి. గతకాలపు జ్ఞాపకాలను మోసుకొంటూ.. రేపటి కలలు కంటూ.. నూతన ఏడాదికి ప్రపంచ దేశాలు ఒక్కొక్కటిగా తెర తీస్తున్నాయి‌. 2021 ఇచ్చిన గుర్తుల్ని గుండెల్లో దాచుకొని.. సరైన దారుల్ని వెతుక్కొంటూ 2022లోకి ఎంట్రీ ఇచ్చారు‌. బాణాసంచా వెలుగులు, లేజర్‌ షోలతో న్యూజిలాండ్ వాసులు మొదటిగా కొత్త సంవత్సరానికి ఘనంగా ఆహ్వానం పలికారు.