New Zealand Cricket: ఇద్దరికీ సమానంగా వేతనాలు.. కివీస్ బోర్డు సంచలన నిర్ణయం

న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది.

  • Written By:
  • Updated On - July 5, 2022 / 03:54 PM IST

న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశ క్రికెట్‌లో స్త్రీ, పురుషులిద్దరికీ సమాన వేతనం ఇచ్చేందుకు కివీస్ క్రికెట్ బోర్డు అంగీకరించింది. తమ వేతనాల విషయంలో వ్యత్యాసానికి సంబంధించి. చాలా కాలంగా మహిళా క్రికెటర్లు, మాజీలు పోరాడుతున్నప్పటికీ ఫలితం కనిపించలేదు. అయితే వారి పోరాటం ఫలించే దిశగా తొలి అడుగు పడింది. ఈ విషయంలో మిగిలిన క్రికెట్ బోర్డుల సంగతి ఎలా ఉన్నా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ముందడుగు వేసింది. మహిళలు, పురుషుల క్రికెటర్లకు సమాన వేతనం ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది.ఐదేళ్ల ఏళ్ల పాటు ఇరు వర్గాల క్రికెటర్లకు సమాన వేతనం ఇవ్వాలని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు, ప్లేయర్స్ అసోసియేషన్ ఒప్పందంపై సంతకం చేశాయి. దీని ప్రకారం, స్త్రీ, పురుషుల క్రికెటర్లకు సమాన వేతనం లభిస్తుంది.

ఈ ఒప్పందంతో అన్ని ఫార్మాట్‌లు, అన్ని పోటీల్లో పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లు మ్యాచ్ ఫీజును అందుకుంటారు. ఇది తమ ఆటలో అత్యంత ముఖ్యమైన ఒప్పందమని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. క్రికెట్‌కు నిధులు సమకూర్చడానికి, అభివృద్ధి చేయడానికి ఈ ఒప్పందం పునాదిని ఏర్పరస్తుందని వ్యాఖ్యానించింది. కాగా తాజా ఒప్పందం ప్రకారం న్యూజిలాండ్ దేశీయ కాంట్రాక్టుల సంఖ్య 54 నుంచి 72కి పెరుగునుంది. అయికే ఎక్కువ సంఖ్యలో ఆడిన మ్యాచ్‌లు, పోటీ చేసిన ఫార్మాట్‌లు, శిక్షణ, ఆడిన సమయం కారణంగా మెన్ క్రికెటర్లు అధికంగా సంపాదిస్తారు. మ్యాచ్ ఫీజు సమానమే అయినప్పటికీ.. ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన వారికి ఎక్కువ మొత్తం లభిస్తుంది. అయితే మహిళల జట్టుకు కూడా మ్యాచ్ లను క్రమంగా పెంచే అంశంపైనా పలు బోర్డులు ఆలోచిస్తున్నాయి. దీనిపై ఐసీసీతో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.