Retirement Age: ఉద్యోగులకు శుభవార్త.. రిటైర్మెంట్ ఏజ్ రెండేళ్లు పెంపు.. కానీ?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చక్కటి శుభవార్త. కేంద్రపాలిత ప్రాంత అడ్మినిస్ట్రేటర్ బన్వరిలాల్ పురోహిత్ చండీగఢ్ లో వర్తించే సెంట్రల్ సర్వీస్ రూల

  • Written By:
  • Publish Date - June 1, 2023 / 07:15 PM IST

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చక్కటి శుభవార్త. కేంద్రపాలిత ప్రాంత అడ్మినిస్ట్రేటర్ బన్వరిలాల్ పురోహిత్ చండీగఢ్ లో వర్తించే సెంట్రల్ సర్వీస్ రూల్స్ ను నోటిఫై చేశారు. కాగా ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు రెండేళ్లు పెరిగిన విషయం తెలిసిందే. ఇంతకుముందు 58 సంవత్సరాలు ఉండగా ఇప్పుడు అది 60 సంవత్సరాలుగా మారింది. ఈ క్రమంలోనే ఉపాధ్యాయులు నెలకు రూ.4000 వరకు ప్రయాణ భత్యం పొందుతారు. అంతేకాకుండా సీనియారిటి ఉన్న ఉపాధ్యాయులను పాఠశాలలకు ఇప్పుడు డిప్యూటీ ప్రిన్సిపల్ గా నియమిస్తున్నారు.

మహిళా ఉద్యోగులకు శిశు సంరక్షణ కోసం రెండేళ్లు సెలవు ఉంటుంది. 12వ తరగతి వరకు ఇద్దరు పిల్లల తల్లిదండ్రులకు విద్యాభత్యం లభిస్తుంది. ఈ నోటిఫికేషన్ యుటి ఉద్యోగుల పే స్కేల్ షరతులను కూడా మారుస్తుంది. సెంట్రల్ సర్వీస్ రూల్స్ ఆమోదించడంతో పదవీ విరమణ వయసు కూడా 2022 నుండి 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు పెరిగింది. సెంట్రల్ సర్వీస్ రూల్స్ అమల్లోకి రావడంతో ఉద్యోగుల వేతన స్కేలు ప్రస్తుతం పంజాబ్ ప్రభుత్వ ఉద్యోగులలోని ఆయా కేటగిరీలకు అనుగుణంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది.

కాగా ఇప్పుడు ఇవి రాష్ట్రపతి సెంట్రల్ సివిల్ సర్వీస్ లోని సంబంధించిన సేవలకు సమానంగా ఉంటాయి.. చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంత వ్యవహారాల్లో పని చేస్తున్న ఆల్ ఇండియా సర్వీసెస్ సభ్యులు పంజాబ్, హర్యానా హైకోర్టు ఉద్యోగులు, UT చందిగడ్లో పూర్తి సమయం ఉద్యోగం చేయని వ్యక్తులు ఆకస్మిక పరిస్థితుల నుంచి చెల్లించే వ్యక్తులకు ఈ నియమాలు వర్తించవు. పంజాబ్ లో ఆఫ్ ప్రభుత్వం ఏర్పడిన 14 రోజుల తరువాత చండీగఢ్లో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ సర్వీస్ రూల్ను అమలు చేస్తున్నట్లు హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.