e-Challan: నకిలీ ట్రాఫిక్ చలాన్ల వెబ్‌సైట్స్ .. జాగ్రత్త

ట్రాఫిక్ చలాన్లపై ప్రభుత్వం భారీ రాయితీలు ప్రకటించిన కొద్ది రోజులకే తెలంగాణ ట్రాఫిక్ పోలీసుల ఈ-చలాన్ వెబ్‌సైట్ సర్వర్ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ క్రమంలో ఈ చలాన్ పేరుతో నకిలీ వెబ్ సైట్స్ పుట్టుకొస్తున్నాయి.

e-Challan: ట్రాఫిక్ చలాన్లపై ప్రభుత్వం భారీ రాయితీలు ప్రకటించిన కొద్ది రోజులకే తెలంగాణ ట్రాఫిక్ పోలీసుల ఈ-చలాన్ వెబ్‌సైట్ సర్వర్ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ క్రమంలో ఈ చలాన్ పేరుతో నకిలీ వెబ్ సైట్స్ పుట్టుకొస్తున్నాయి. దీంతో అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. ఫేక్ పోర్టల్స్‌పై ఎలాంటి వ్యక్తిగత వివరాలను షేర్ చేయవద్దని, వినియోగదారులకు అవగాహన కల్పించాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు.

చలాన్ రేట్లపై 80 శాతం డిస్కౌంట్ ప్రకటించడంతో వాహనదారులు ఎగబడుతున్నారు. భారీ డిస్కౌంట్ కారణంగా భారీ మొత్తంలో డబ్బులు ఆదా చేయవచ్చని చలాన్లను కట్టేస్తున్నారు.సాధారణంగా, వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేసిన తర్వాత, వెబ్‌సైట్ పెండింగ్‌లో ఉన్న చలాన్‌ల వివరాలను స్క్రీన్ పైన చూపిస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా సర్వర్ డౌన్ కావడంతో వినియోగదారులు చెల్లింపులు చేయలేకపోతున్నారు.

అధిక సెర్చ్ వాల్యూమ్ కారణంగా సర్వర్ సమస్యలు తలెత్తాయని, పెండింగ్‌లో ఉన్న చలాన్లు పోర్టల్‌లో కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారు ఇప్పటికీ సమీపంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లలో చలాన్‌లు చెల్లించవచ్చు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. కాగా జనవరి 10 వరకు ఈ చలానాపై 80 శాతం డిస్కౌంట్ తో చెల్లించవచ్చు.

Also Read: CM Revanth: స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి రేవంత్ 2 లక్షల సాయం