Chennai Airport: చెన్నై విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ అందుబాటులోకి వచ్చింది. తమిళ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ కొత్త టెర్మినల్ ను అద్బుతంగా నిర్మించారు. శనివారం ఈ కొత్త టెర్మినల్ ను ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై ఎయిర్ పోర్టులో ప్రారంభించనున్నారు. దాదాపు రూ.1260 కోట్లతో చెన్నై ఎయిర్ పోర్టులో ఈ కొత్త టెర్మినల్ ను మోదీ ప్రారంభించారు. 2,20,972 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని నిర్మించారు. చెన్నై ఎయిర్‌పోర్టులో విమాన ట్రాఫిక్ ను తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది.
చెన్నై ఎయిర్ పోర్టులో నిర్మించిన ఈ కొత్త టెర్మినల్ భవనాలకు సంబంధించిన ఫొటోలను ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు. చెన్నై మౌలిక సదుపాయాలకు ఇది ఒక ముఖ్యమైన అదనంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఇది కనెక్టివిటీని పెంచుతుందని, స్థానిక ఆర్ధిక వ్యవస్థకు కూడా ప్రయోజనం ఉంటుందని మోదీ ట్విట్టర్ లో పేర్కొన్నారు. తమిళ సంస్కృతికి ప్రతిబింబించేలా ఈ కొత్త టెర్మినల్ నిర్మాణం జరిగింది.
కొత్త టెర్మినల్ రూపకల్పనలో కోలం, దక్షిణ భారత గృహాల ప్రవేశ ద్వారం వద్ద కనిపించే రంగోలి లేదా అలంకార కళ, చీరలు, టెంపుల్స్, సహజ పరికరాలను హైలైట్ చేసే అంశాలు వంటి సంప్రదాయ లక్షణాలను పొందుపర్చారు. శనివారం మోదీ హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్ధాపన చేయనున్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య తిరగనున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను మోదీ ప్రారంభించనున్నారు. అలాగే బీబీ నగర్ ఎయిమ్స్ బిల్డింగ్ ను ప్రారంభించనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో జరిగనున్న భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నారు.శనివారం ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు హైదరాబాద్ లో మోదీ ఉండనున్నారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి చెన్నైకు మోదీ వెళ్లనున్నారు.