Site icon HashtagU Telugu

Cancer: వెలుగులోకి క్యాన్సర్ కొత్త లక్షణం…గుర్తించకపోతే అంతే సంగతులు..!

Cancer Symptoms 722x406 Imresizer

Cancer Symptoms 722x406 Imresizer

Cancer symptoms: ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బారినపడి ప్రతిఏటా ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. క్యాన్సర్ అనేది ప్రమాదకరమైన రోగాల్లో ఒకటి. దీనిబారిన పడి ఎంతో ప్రాణాలు కోల్పోతున్నారని డబ్ల్యూహెచ్ ఓ చెబుతోంది. ఈ మహమ్మారి బారినపడితే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఈ భయంకరమైన వ్యాధి ఒక కణంలో చిన్న పుండలా తయారూ…దశల వారిగా పెద్దదైతుంది. రోగం ముదురుతుంది. ఈ రోగం ముదిరాకనే లక్షణాలు బయటకు కనిపిస్తాయి. ఆ సమయంలో కణాలు విపరీతంగా పెరిగిపోతాయి. దాని నియంత్రణ అనేదే లేనంతగా పెరుగుతాయి. దీంతో శరీర అవయవాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఆ సమయంలో చికిత్స చేయడం చాలా కష్టంగా మారుతుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. అయితే ఈ జబ్బు ఒకసారి తగ్గితే…మరలా వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అందుకే క్యాన్సర్ మహమ్మారి అతి భయంకరమైంది.

కాగా క్యాన్సర్ రకాల్లో ఎక్కువగా రొమ్ము, ప్రొస్టేట్, పెద్దపేగు వంటివే ఎక్కువగా సోకుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు ఉన్న క్యాన్సర్ కణాల గురించి మీకు తెలిసిందే. కానీ తాజాగా క్యాన్సర్ కొత్త లక్షణాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ లక్షణం సర్వసాధారణంగానే ఉంటుంది. అందుకే ఎవరూ దీన్ని పట్టించుకోవడం లేదట. కానీ ఈ లక్షణాలను అంత ఈజీగా తీసిపారేయాల్సిన అవసరంలేదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆ లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఉదయం నిద్రలేవగానే ఎలా ఉంటారు. రీఫ్రెష్ గా, ఉత్సాహంగా ఉంటారు. కానీ కొంతమందిలో ఈ లక్షణాలు కనిపించడం లేదట. వీరికి తీవ్రమైన దగ్గు, తుమ్ములు, ముక్కు కారడం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. వీటిని తేలిగ్గా తీసుకోవల్సిన వీల్లేదు. ఎందుకంటే ఇవి కూడా క్యాన్సర్ లక్షణాలని నిపుణులు చెబుతుున్నారు. ఒకవేళ మీకు ఉదయం లేవగానే వెంటనే అలసట, దగ్గు వచ్చినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించండి. ఈ లక్షణాలు ఒక్కోసారి మనలోని క్యాన్సర్ వల్ల కూడా వచ్చే ప్రమాదనం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇక రెండు వారాలుగా ఉదయం లేవగానే గొంతునొప్పి సమస్య వేధించినట్లయితే…దాన్ని కూడా క్యాన్సర్ గానే అనుమానించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా ధూమపానం చేసే అలవాటున్న వారికి క్యాన్సర్ ఎక్కువగా సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి వారిలో ఈ లక్షణాలు కనిపిస్తే క్యాన్సర్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు.

క్యాన్సర్ ఎందుకు వస్తుంది..
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం…స్మోకింగ్ చేయడం, మద్యం సేవించడం, వారసత్వంగా, క్యాన్సర్ కారకాలైన వైరస్ లు సోకడం, జన్యువుల మూలం, రసాయన క్యాన్సర్ కారకాల మూలం వంటి కారణాల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని తెలిపింది.

ఎలా అడ్డుకోవాలి…
వారసత్వంగా వచ్చే క్యాన్సర్లను అడ్డుకోవడం చాలా కష్టం. వైద్యులతోకూడా కాదు. లైఫ్ స్టైల్ ను మార్చడం వల్ల క్యాన్సర్లను అడ్డుకోవచ్చు. వ్యాయామాలు చేయడం, తాజాగా కూరగాయాలు తినడం, పండ్లు తినడం, చికెన్, ఉడకబెట్టిన గుడ్లు తినడం వల్ల క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు.