Ration Cards: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నింటిని ఒక్కోక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్తుంది. అధికారంలోకి రాగానే.. ముందుగా వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం అమలు చేసింది. ఆ తర్వాత ఆరోగ్యశ్రీ మొత్తాన్ని 10 లక్షల రూపాయలకు పెంచింది. ఆ తర్వాత మహాలక్ష్మి పథకంలో భాగంగా పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్‌తో పాటు.. రూ. 500లకే గ్యాస్ సిలిండర్ హామీలను ప్రారంభించారు.
ఈ ఏడాది అనగా 2024, మార్చి 1వ తేదీ నుంచి ప్రజలకు ఈ రెండు హామీలు అందుబాటులోకి వచ్చాయి. ఇక మహాలక్ష్మి పథకంలో మరో స్కీం పెండింగ్‌లో ఉంది. అదే 18 ఏళ్లు నిండిన మహిళలందరికి నెలకు 2500 రూపాయలు ఇచ్చే స్కీం. త్వరలోనే దీన్ని అమలు చేయబోతున్నట్లుగా కాంగ్రెస్ సర్కార్ ప్రకటించింది. అలానే తెల్ల రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.