Breast Cancer: రొమ్ము క్యాన్సర్ చికిత్సలో విప్లవం…సరికొత్త అణువుతో చెక్..!!

రొమ్ము క్యాన్సర్...చాలా మందిని ఇబ్బంది పెడుతున్న వ్యాధి. రొమ్ము క్యాన్సర్ చికిత్స విషయంలో సరికొత్త విప్లవానికి నాంది పడింది.

  • Written By:
  • Publish Date - April 15, 2022 / 10:45 AM IST

రొమ్ము క్యాన్సర్…చాలా మందిని ఇబ్బంది పెడుతున్న వ్యాధి. రొమ్ము క్యాన్సర్ చికిత్స విషయంలో సరికొత్త విప్లవానికి నాంది పడింది. ఈ వ్యాధిపై పరిశోధన చేస్తున్న భారత, అమెరికన్ శాస్త్రవేత్తల బృందం వారి సహ శాస్త్రవేత్తలతో కలిసి రొమ్ము క్యాన్సర్ చికిత్స చేయడంలో సహాయపడే ఒక అణువును కనుగొన్నారు. ఇది సంప్రదాయ చికిత్సతో ఊరట పొందలేకపోతున్నప్పటికీ..రొమ్ము క్యాన్సర్ బాధితులకు ఒక గొప్ప ఆశను కలిగిస్తోందని చెప్పవచ్చు. ఇప్పుడు వీరు కనిపెట్టిన ఫస్ట్ -ఇన్-క్లాస్ అణువు ఈస్ట్రోజన్ సెన్సిటివ్ రొమ్ము క్యాన్సర్ కు కొత్త మార్గంలో అణిచివేస్తుదని పరిశోధకులు వెల్లడించారు. ఫస్ట్-ఇన్-క్లాస్ మందులు ఒక ప్రత్యేకమైన యంత్రాంగం ద్వారా పనిచేస్తాయి. ఈ సందర్భంలో క్యాన్సర్ కణితి కణాల ఈస్టోజెన్ గ్రాహకంపై ప్రోటీన్ ను లక్ష్యంగా చేసుకుని ఈ అణువు దాడి చేస్తుంది.

ఇది ఈస్టోజెన్ రిసెప్ట్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ కు ప్రాథమికంగా విభిన్నమైన కొత్త తరగతి ఏజెంట్లు అని టెక్సాస్ యూనివర్సిటి సిమన్స్ క్యాన్సర్ సెంటర్ ప్రొఫెసర్ గణేష్ రాజు అన్నారు. దీనిపై ప్రత్యేకమైన చర్య విధానం ప్రస్తుత చికిత్సల పరిమితులను అధిగమిస్తుందని తెలిపారు. అన్ని రొమ్ము క్యాన్సర్లు కూడా ఈస్ట్రోజెన్ పెరగడానికి అవసరమా అని నిర్దారించుకోవడానికి టెస్టు చేసినట్లు తెలిపారు. దానిలో 80శాతం ఈస్ట్రోజెన్ సెన్సిటివ్ అని తేలినట్లు పరిశోధకులు తెలిపారు. ఇక ఈ క్యాన్సర్లు తరచుగా టామోక్సిఫెన్ వంటి హార్మోన్ థెరఫీతో సమర్థవంతంగా చికిత్స చేయవచ్చన్నారు. అయితే ఈ క్యాన్సర్లలో మూడింట ఒక వంతు మంది చివరికి నిరోధకతను పొందుతారు. ఇప్పుడు కనుగొన్న ఈ కొత్త సమ్మేళనంలో ఈ రోగులకు అత్యంత ప్రభావవంతమైన తరువాతి వరుస చికిత్స లభిస్తుందని రాజ్ గణేష్ చెప్పారు.

టామోక్సిఫెన్ వంటి సాంప్రదాయ హార్మోన్ల మందుల క్యాన్సర్ కణాలలో ఈస్ట్రోజెన్ రిసెపటర్ అని పిలిచే ఒక అణువును అటాచ్ చేయడం ద్వారా పనిచేస్తాయి. ఈస్ట్రోజెన్ను గ్రాహకానికి బంధించకుండా నిరోధిస్తుంది. ఈస్ట్రోజెన్ రిసెప్టర్ కాలక్రమేణా దాని ఆకారాన్ని మార్చుతుంది. దీంతో చికిత్స మందు ఇకపై గ్రాహకంతో చక్కగా సరిపోదు. ఇలా జరిగినప్పుడు క్యాన్సర్ కణాలు మళ్లీ పుట్టడం మొదలైతుంది. అయితే ఇప్పుడు కనుగొన్న అణువుతో ఈ ఇబ్బంది తొలగిపోనుంది. ఈస్ట్రోజెన్ రిసెప్టర్ సామార్థ్యాన్ని నిరోధించే ఔషధాలను డెవలప్ చేయడంలో ఆసక్తి ఉండటంతో విపరీతమైన పరిశోధనలు జరుగుతున్నాయి.

చాలా రకాల బ్రెస్ట్ క్యాన్సర్లలో ప్రధాన లక్ష్యం. కణితి పెరుగుదలకు కారణమయ్యే కో రెగ్యులేటర్ ప్రోటీన్లతో సంకర్షణ చెందకుండా నిరోధించడమని యుటి నైరుతి ప్రొఫెసర్ డేవిడ్ మాంగెల్స్ డోర్ఫ్ తెలిపారు. ఇలాంటి ప్రొటీన్-ప్రొటీన్ పరస్పర చర్యలను నిరోధించడం దశాబ్దాలుగా క్యాన్సర్ పరిశోధకుల కల. అది ఇప్పటికీ సాకరమైనట్లుగా పరిశోధకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఔషధాలు ఇతర అణువులను నిరోధించడం ద్వారానే పనిచేస్తాయి. సహ కారకాలు అని పిలిచే ప్రొటీన్లు, క్యాన్సర్ కణాలు గుణించడానికి ఈస్ట్రోజెన్ గ్రాహకానికి కూడా జత చేయాలి. ఇప్పుడు కనుగొన్న ERX11గా పిలిచే కొత్త అణువు పెప్టైడ్ లేదా ప్రోటీన్ బిల్డింగ్ బ్లాక్ ను అనుకరిస్తుందని పరిశోధకులు వెల్లడించారు.