Site icon HashtagU Telugu

Medical Colleges: తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ కాలేజీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Medical Colleges

Medical Colleges

Medical Colleges: దేశంలో కొత్తగా వైద్యకలశాలల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా కొత్తగా 50 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

భార‌త‌దేశంలో వైద్య రంగం కొత్త పుంత‌లు తొక్కుతోంది. వైద్యరంగంలో భారత్ ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వైద్య రంగంలో గణనీయ మార్పులు తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. తాజాగా జాతీయ వైద్య కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో త్వరలో మరో 50 వైద్య కళాశాలలకు ఆమోదం తెలిపింది. అందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనూ కొత్తగా వైద్య కళాశాలలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర వైద్య శాఖ.

తెలంగాణలో 12 కొత్త వైద్య కాలేజీలకు ఆమోదముద్ర వేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ లోని ఐదు కొత్త కాలేజీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ సీట్లు భారీగాపెరగనున్నాయి. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఒక్కో కాలేజీలో 150 సీట్లతో తరగతులు మొదలవుతాయని వైద్య శాఖ పేర్కొంది.

తెలంగాణాలో మెడికల్ కాలేజీలు: మేడ్చల్‌, వరంగల్‌, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, అసిఫాబాద్‌, నిర్మల్‌, సిరిసిల్ల, వికారాబాద్‌, జనగాం, హైదరాబాద్‌లలో కొత్త కళాశాలల ఏర్పాటుకు కేంద్రం ఆమోదించింది. మేడ్చల్‌-మల్కాజిగిరిలో అరుందతి ట్రస్ట్‌, మేడ్చల్‌లో సీఎంఆర్‌ ట్రస్ట్‌, వరంగల్‌లో కొలంబో ట్రస్ట్‌ల ఆధ్వర్యంలో వైద్యకళాశాలలు ఏర్పాటు కానున్నాయి. మిగిలిని అన్ని కాలేజీలను ప్రభుత్వమే ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది.

ఇక ఆంధ్రప్రదేశ్ లో చూస్తే…. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమహేంద్రవరం, విజయనగరం జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి.

Read More: Delhi CM Arvind Kejriwal : కేజ్రీవాల్ మాట్లాడుతుండ‌గా మోదీ.. మోదీ అంటూ నినాదాలు.. ఢిల్లీ సీఎం ఏం అన్నాడో తెలుసా?