BRS Party: ధర్మపురి లో చేరికల హోరు, బీఆర్‌ఎస్‌ జోరు

ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్ లో రోజు రోజుకు చేరికలు పెరుగుతున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Trs

Trs

BRS Party: ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్ లో రోజు రోజుకు చేరికలు పెరుగుతున్నాయి. తాజాగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్, తన అనుచరులతో కలిసి ధర్మపురి లో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో గులాబీ పార్టీ లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ కే మా మద్దతు అంటు ప్రకటించారు.

పార్టీ లో చేరిన వారికి మంత్రి కొప్పుల ఈశ్వర్ గులాబి కండువ కప్పి స్వాగతం పలికారు. ఆవుల శ్రీనివాస్ వెంట DCC యూత్ జనరల్ సెక్రటరీ ఆవుల వేణు ఆవులు వెంకటేష్, ఆవుల ప్రతిష్, కనుకుట్ల సుజాత. శ్రీనివాస్ రెడ్డి, పాలమాకుల ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సరికొండ మహంకర్, దామార పెల్లి మనోజ్, సతీష్, జిల్లా అనిల్, శేఖర్, నరష్ తదితరులు ఉన్నారు.

  Last Updated: 03 Nov 2023, 01:16 PM IST