BRS Minister: వలసల వెల్లువ, పాలకుర్తి బిఅర్ఎస్ లోకి భారీగా చేరికలు

 గత కొంతకాలంగా పాలకుర్తి నియోజకవర్గం లో బీఆర్ఎస్ పార్టీలోకి వలసల వెల్లువ కొనసాగుతోంది.

  • Written By:
  • Publish Date - November 6, 2023 / 11:14 AM IST

BRS Minister: గత కొంతకాలంగా పాలకుర్తి నియోజకవర్గం లో బీఆర్ఎస్ పార్టీలోకి వలసల వెల్లువ కొనసాగుతోంది. కాంగ్రెస్ సహా బిజెపి, వివిధ సామాజిక వర్గాల నేతలు, వృత్తి సంఘాల నాయకులు, వివిధ వర్గాల ప్రజలు, యువకులు భారీ ఎత్తున రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో బి అర్ ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ కు ముందు నుంచే ఈ వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా తొర్రూరు మండలం అమ్మా పురం, జీ కే తండా, వెలి కట్ట, ఫ త్తే పురం, ఖానాపూర్, ధర్మా తండాలకు చెందిన 500 మంది మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బి అర్ ఎస్ పార్టీలో చేరారు. వాళ్లకు మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తొర్రూరు మండలం అమ్మా పురం గ్రామం నుండి బుదిగ జంగాల సంఘంకు చెందిన 70 మంది, అదే గ్రామానికి చెందిన మహిళా సంఘాల సభ్యులు 50 మంది, వివిధ సామాజిక సంఘాల సభ్యులు 100 మంది, మరికొందరితో కలుపుకుని మొత్తం 250 మంది వేర్వేరుగా బి ఆర్ ఎస్ లో చేరారు.

అలాగే, అమ్మా పురం జీ కే తండా నుండి 150 మంది, వెలి కట్ట గ్రామం నుండి 50 మంది, ఫ త్తే పురం నుండి మాజీ ఎంపీటీసీ అనిమిరెడ్డి రవీందర్ రెడ్డి అధ్వర్యంలో 10 మంది, ఖానాపూర్ నుండి కాంగ్రెస్ వార్డు సభ్యులు మాచర్ల వెంకన్న గౌడ్ నాయకత్వంలో 10 మంది, ఫ త్తే పురం ధర్మా తండా నుండి 40 మంది బి అర్ ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ దేశంలో టిఆర్ఎస్ పార్టీ మాత్రమే కార్యకర్తల కోసం వారి సంక్షేమం కోసం పనిచేస్తున్నదని తెలిపారు. టిఆర్ఎస్ లాంటి పార్టీ దేశంలో లేదన్నారు. కార్యకర్తల కోసం బీమా ప్రీమియం కట్టి ఏ కారణం చేత చనిపోయిన ఆ కార్యకర్తల కుటుంబానికి రెండు లక్షల రూపాయల బీమా అందజేస్తున్న ఏకైక పార్టీ బిఆర్ఎస్ అని మంత్రి తెలిపారు. దాదాపు కోటి మంది సభ్యులుగా గల పార్టీ మరోటి లేదన్నారు.

అనుభవజ్ఞుడైన సీఎం కేసీఆర్ నేతృత్వం, సమర్థవంతమైన కేటీఆర్ యువ నాయకత్వం బి అర్ ఎస్ సొంతం అన్నారు. టిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ రంగాలలో అత్యంత ముందుందని ఆయన చెప్పారు. టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం మాత్రమే భవిష్యత్తు భారతావనికి దిక్సూచి అని మంత్రి వివరించారు ఈరోజు పార్టీలో చేరిన వాళ్లందరికీ సముచిత గౌరవం గుర్తింపు దక్కుతాయని కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని పార్టీ కార్యకర్తలు అంతా ఈ ఎన్నికల్లో తన విజయం కోసం పనిచేయాలని మంత్రి సూచించారు.