WhatsApp: వాట్స‌ప్ లో త్వ‌ర‌లోనే మీకు ఉప‌యోగ‌ప‌డేలా కొత్త‌ ఫీచ‌ర్ రాబోతుంది..!!

వాట్సాప్...ప్రపంచంలోనే నెంబర్ వన్ మెసేజింగ్ యాప్ గా దూసుకుపోతోంది. లేటెస్ట్ ఫీచర్లను యూజర్లను అట్రాక్ట్ చేస్తుంది వాట్సాప్.

  • Written By:
  • Publish Date - March 11, 2022 / 12:11 PM IST

వాట్సాప్…ప్రపంచంలోనే నెంబర్ వన్ మెసేజింగ్ యాప్ గా దూసుకుపోతోంది. లేటెస్ట్ ఫీచర్లను యూజర్లను అట్రాక్ట్ చేస్తుంది వాట్సాప్. అయితే వాట్సాప్ లోకి ఇంకా అందుబాటులోకి రావాల్సిన ఫీచర్లు కొన్ని మిగిలే ఉన్నాయి. అందులో భాగంగానే గ్రూప్ పోల్స్ ను పరిచయం చేస్తోంది వాట్సాప్ . ఎక్కువ ఫీచర్స్ ఉన్న మెసేజింగ్ యాప్స్ లో టెలిగ్రామ్ ముందు వరుసలో ఉంటుంది. అందుకే టెలిగ్రామ్ లో ఎక్కువగా పాపులార్టీ సంపాదించిన ఫీచర్లను తమ యూజర్ల కోసం డెవలప్ చేసిన పనిలో నిమగ్నమైంది వాట్సాప్. వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం..యూజర్ల కోసం లేటెస్టు బీటా వెర్షన్ లో గ్రూప్ చాట్స్ లో పోల్స్ ను క్రియేట్ చేసేందుకు వీలుగా గ్రూప్ పోల్స్ ఫీచర్స్ ను డెవలప్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ఫీచర్ ఎలా వర్క్ చేస్తుందో తెలిపే స్క్రీన్ షాట్ కూడా షేర్ చేసింది వాట్సాప్.

గ్రూప్ పోల్స్ ఫీచర్…ఫేస్ బుక్ మెసెంజర్, టెలిగ్రామ్ యాప్స్ లో అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం, కొత్తగా గ్రూప్ పోల్ ను క్రియేట్ చేసేందుకు ముందుగా ఒక ప్రశ్నను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత దానికి ఆప్షన్స్ ను జోడించాల్సి ఉంటుంది. ప్రశ్నతోపాటుగా ఆప్షన్స్ కూడా గ్రూప్ మెంబర్స్ కనిపిస్తాయి. మెంబర్స్ సెలక్ట్ చేసిన ఆప్షన్ను బట్టి రిజల్ట్స్ వస్తాయి. అయితే గ్రూప్ అడ్మిన్స్ కు పోల్ ఆప్షన్స్ ఉంటాయా లేదా అలాగే పోలింగ్ కు టైం లిమిట్ ఉంటుందా అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

వాట్సాప్ లో పంపించే మెసేజ్ లు, అటాచ్ మెంట్స్ లానే పోల్స్ వివరాలు కూడా ఎండ్ -టు-ఎండ్ ఎన్ క్రిప్షన్ ద్వారా సేవ్ గా ఉండనున్నాయి. గ్రూప్ మెంబర్స్ కు మాత్రమే పోల్ రిజల్ట్స్ చూసే అవకాశం ఉంటుంది. ఈ పోలింగ్ ఫీచర్…ప్రస్తుతం ఇంకా డెవలప్ మెంట్ స్టేజ్ లోనే ఉంది. వాట్సాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత…గ్రూపుల్లో కొన్ని వివాదాస్పదమైన పోస్టులు, పోటాపోటీ పోస్టులు…అనేవివాదాలకు దారితీసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

గ్రూపులో ఏం జరిగినా…అడ్మిన్ దే పూర్తి బాధ్యత అవుతుంది. అయితే ఈ సమస్యలను సాల్వ్ చేసేందుకు వాట్సాప్ ఈమధ్యకాలంలోనే ఫీచర్ అప్ డెట్ చేసింది. గ్రూపులోని సదరు యూజర్ పంపించిన సందేశాలను తొలగించేందుకు గ్రూప్ అడ్మిన్ లకు అనుమతించే ఫీచర్ ను వాట్సాప్ డెవలప్ చేసింది. ఈ ఫీచర్ సాయంతో…గ్రూపులో అడ్మిన్ లుగా ఉన్నవాళ్లు గ్రూపులోని ఏ సందేశాన్నైనా డిలీట్ చేయవచ్చు. వాట్సాప్ గ్రూపు నిర్వహిస్తున్న వారికి ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. గ్రూపులోని పనికిరాని మెసేజ్ లను తొలగించాంటూ పంపిన వారు మాత్రమే డిలీట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు డిలీట్ చేసే అనుమతి గ్రూపు అడ్మిన్ లకు కూడా ఉంటుంది. ఇలా ఇంకా ఎన్నో అప్ డేట్స్ పై వాట్సాప్ పనిచేస్తుంది.