Site icon HashtagU Telugu

Accident : ఫుట్‌పాత్ మీద నిద్రిస్తున్న వారిపై దూసుకెళ్లిన ట్రక్.. 4 గురు దుర్మరణం..!!

Accident

Accident

దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. ఫుట్‌పాత్ పై నిద్రిస్తున్న వారిపై ట్రక్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఢిల్లిలోని సీమాపూరి ప్రాంతంలో తెల్లవారుజామున చోటుచేసుకుంది. ట్రక్కు అదుపు తప్పడం వల్లే ఈప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

మంగళవారం రాత్రి 1:51 గంటలకు సీమాపురి బస్ డిపో సమీపంలోఫుట్‌పాత్ పై  నిద్రిస్తున్న ఆరుగురిపై ట్రక్కు దూసుకెళ్లిందని సమాచారం అందడంతో ఘటన స్థలానికి చేరుకున్నట్లు  డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఆర్.సత్యసుందరం తెలిపారు. తీవ్రంగా గాయపడినవారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ఒకరు మరణించినట్లు పోలీసులు తెలిపారు.

మృతులను కరీం (52), ఛోటే ఖాన్ (25), షాలిమార్ గార్డెన్‌లో నివసిస్తున్న షా ఆలం (38), సీమాపురి నివాసి రాహుల్ (45) గా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన తులసి నికేతన్‌కు చెందిన మనీష్ (16), తాహిర్‌పూర్‌కు చెందిన ప్రదీప్ (30) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ట్రక్కును స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.