Site icon HashtagU Telugu

AP Cases: ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు!

corona

corona

ఏపీలో కరోనా ప్రభావం చూపుతూనే ఉంది. గత వారంరోజుల పోలిస్తే తాజాగా నమోదవుతున్న కేసుల్లో చాలా వ్యత్యాసం ఉంది. వారంరోజుల క్రితం దాదాపు పది వేల కేసులు నమోదైతే.. గడిచిన 24 గంటల్లో 25,284 నమూనాలను పరీక్షించగా 5,879 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 22,76,370కి పెరిగింది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఆయా జిల్లాల్లో కరోనా వ్యాప్తి తగ్గేందుకు టీకా ప్రక్రియను వేగవంతం చేస్తోంది ప్రభుత్వం.