Site icon HashtagU Telugu

New Covid Variant : కరోనా వైరస్ కొత్త వేరియంట్ కలకలం!

Union Health Ministry

Union Health Ministry

New Covid Variant : కరోనా వైరస్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు కరోనాకు చెందిన మరో వేరియంట్ వేగంగా  వ్యాపిస్తోంది. ఇండియాలో కాదు..  బ్రిటన్ లో !! ఒమైక్రాన్ (Omicron)  కరోనా వైరస్ వేరియంట్ లో జన్యుమార్పుల వల్ల ఏర్పడిన “EG.5.1” అనే కొత్త వేరియంట్ ఇప్పుడు బ్రిటన్ లో వ్యాపిస్తోంది.

Also read :  FB Love Story: సరిహద్దులు దాటిన ఫేస్ బుక్ ప్రేమ, శ్రీలంక అమ్మాయితో ఆంధ్రా అబ్బాయి పెళ్లి

ఈ వేరియంట్ ను అంకెల్లో పలకడం ఇబ్బందిగా ఉండటంతో ఎరిస్ (Eris) అని పేరు పెట్టారు. బ్రిటన్ లో నిర్ధారణ అవుతున్న ప్రతి ఏడు కరోనా కేసులలో ఒకటి  “ఎరిస్” వేరియంట్ దే(New Covid Variant) ఉందని ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) రెండు వారాల క్రితమే “ఎరిస్” వేరియంట్ ను ట్రాక్ చేయడం ప్రారంభించిందని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ వెల్లడించారు.