ఏపీలో కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. గడిచిన 24 గంటల్లో 40 వేల శాంపిల్స్ పరీక్షించగా, కొత్తగా 14,502 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. మరో ఏడుగురు మృతి చెందడంతో మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,549కి చేరింది. ఒకరోజులో 4,800 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 93,305 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు ఏపీలో 21.95 లక్షలు కేసులు బయటపడగా, 20.87 వేల మంది వైరస్‌ను జయించారు.
Covid19: ఏపీలో కరోనా కొత్త కేసులు 14,502

Covid Tests