తెలంగాణ (Telangana) మందు బాబు(Drug Addict)లకు గుడ్ న్యూస్. నిత్యం ఒకేరకమైన బ్రాండ్స్ తాగుతూ బోర్ కొడుతోంది కదా..? ఇక ఆ బోర్ లేకుండా చేస్తుంది రేవంత్ సర్కార్. రాష్ట్రంలో కొత్త 200 రకాల సరికొత్త బ్రాండ్ (New Beer Brands) లను తీసుకరాబోతుంది. ఈ మేరకు విధివిధానాలు రూపొందించే పనిలోఎక్సైజ్ శాఖ నిమగ్నమైంది. త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. ఉగాది పండుగ నుంచే కొత్త బ్రాండ్లను అందుబాటులోకి తీసుకరావాలని చూస్తుంది.
EV Vehicles : ఐదేళ్లలో ఏడు రెట్లు పెరిగిన ఈవీల సంఖ్య..!
తెలంగాణలో 85 రకాల లోకల్ బ్రాండ్ బీర్లు, 385 రకాల జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్ బీర్ల సరఫరాకు మాత్రమే అనుమతి ఉన్నది. వీటిలో దాదాపు 40 శాతం బ్రాండ్లు కాలంతో పోటీపడలేక, ఆదరణ కరువై దుకాణం ఎత్తేశాయి. నికరంగా 100 నుంచి 150 రకాల బ్రాండ్లు మాత్రమే నిలిచాయని, గత పదేండ్లుగా ఇవే బ్రాండ్లు మార్కెట్‌లో చలామణిలో ఉండటంతో బీరు ప్రియులు బీరు తాగేందుకు ఇష్టపడడంలేదనై ఎక్సైజ్ శాఖ గుర్తించింది. అందుకే త్వరలో సరికొత్త బ్రాండ్ బీర్లను తీసుకరావాలని చూస్తుంది.