SunRisers: వ్యూహం లేని సన్ రైజర్స్..నెటిజన్ల ట్రోలింగ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ తన చెత్త నిర్ణయాలతో అభిమానుల్ని మరోసారి దారుణంగా నిరాశపరిచింది.

  • Written By:
  • Updated On - February 16, 2022 / 12:54 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ తన చెత్త నిర్ణయాలతో అభిమానుల్ని మరోసారి దారుణంగా నిరాశపరిచింది. భారీ మొత్తంతో మెగా వేలల్లోకి అడుగుపెట్టిన హైదరాబాద్ ఫ్రాంఛైజీ.. అంతర్జాతీయ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్న ఒక్క ఆటగాడిని కూడా దక్కించుకోలేకపోయింది. వేలం ముందు నుంచి కేవలం అన్‌క్యాప్డ్ ప్లేయర్లే లక్ష్యంగా ముందుకెళ్లిన హైదరాబాద్ ఫ్రాంఛైజీ చివరి వరకూ అదే వ్యూహాన్ని ఫాలో అయింది. ఈ క్రమంలో.. తక్కువ ధరకే స్టార్ క్రికెటర్లు అందుబాటులో ఉన్నా.. కొనుగోలు చేయలేకపోయింది.

ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ మెగా వేలంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అనుసరించిన వ్యూహాలపై సోషల్ మీడియాలోఅభిమానులు తమదైన శైలిలో ట్రోల్‌చేస్తున్నారు. సన్‌రైజర్స్‌ ఫ్రాంచైజీ వేలంలో మంచి ఆటగాళ్లను కొనేందుకు రాలేదని.. ఇక్కడ అందించే కూల్ డ్రింక్స్‌ కోసం వచ్చారని ట్రోల్‌ చేస్తున్నారు. ముఖ్యంగా ఫామ్ లో లేని నికోలస్‌ పూరన్‌ ను రూ.10.75 కోట్లు, షెఫర్డ్‌ ను రూ.7.75 కోట్లు, అభిషేక్‌ శర్మ రూ.6.5 కోట్లకు దక్కించుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

మెగా వేలంలో ఆఖరికి రూ.10 లక్షల మినహా మొత్తం ఖర్చు పెట్టేసిన సన్‌రైజర్స్ హైద్రాబాదు.. కేవలం 20 మందినే కొనుగోలు చేసింది. ఇందులో సగానికిపైగా అన్‌క్యాప్డ్ ప్లేయర్లే ఉండటం అందర్నీ షాక్ కు గురిచేస్తోంది. మొత్తంగా ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో లో 23 మంది ఉండగా.. ఇందులో 8 మంది విదేశీయులు ఉన్నారు… అయితే ఐపీఎల్ తో పాటుగా అంతర్జాతీయ క్రికెట్ లో అంతగా అనుభవం లేని యువ ఆటగాళ్లతో ట్రోఫీ సాధించడం ఈసారి కష్టమనే అభిప్రాయం వినిపిస్తోంది.