తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ (Telangana Congress)కి సోషల్ మీడియా(Social Media)లో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ‘రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు?’ అనే ప్రశ్నతో అధికారిక X (ట్విట్టర్) ఖాతాలో పోల్ పెట్టగా, అనూహ్యంగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి. ఈ పోల్‌లో “ఫామ్ హౌస్ పాలన”, “ప్రజల వద్దకు పాలన” అనే రెండు ఆప్షన్లు ఇచ్చారు. అయితే, నెటిజన్లు ఫామ్ హౌస్ పాలనకు అధికంగా మద్దతు పలికారు.
Allu Arjun – Trivikram Film : కార్తికేయుని పాత్రలో అల్లు అర్జున్?
ఈ పోల్‌లో 73% మంది “ఫామ్ హౌస్ పాలన” అనే ఆప్షన్‌కు ఓటేయగా, “ప్రజల వద్దకు పాలన” అనే ఆప్షన్ తక్కువ మద్దతు పొందింది. దీనితో కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవం ఎదురైనట్లు అయ్యింది. ప్రభుత్వ పనితీరుపై అవగాహన కల్పించాలని పెట్టిన పోల్, ట్రోలింగ్‌కు దారితీసింది. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో విపరీతమైన సెటైర్లు వేస్తూ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం (ప్రస్తుత బీఆర్ఎస్) ఫామ్ హౌస్ పాలన చేస్తోందని కాంగ్రెస్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు అదే పేరును నెటిజన్లు ఎంచుకోవడం, ప్రజలు కాంగ్రెస్ పాలనను నమ్మడం లేదని సూచిస్తోందని బీఆర్ఎస్ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు ఈ పోల్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో దూకుడు పెంచిన బీఆర్ఎస్, దీనిని క్యాంపెయిన్‌గా మార్చుకునే పనిలో పడింది. ఇకపై కాంగ్రెస్ సోషల్ మీడియాలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు?
— Telangana Congress (@INCTelangana) January 29, 2025