Site icon HashtagU Telugu

Netizens: కుక్కలపై దారుణంగా ప్రవర్తించిన మహిళ.. మండిపడుతున్న నెటిజన్లు

Whatsapp Image 2023 04 14 At 20.26.46

Whatsapp Image 2023 04 14 At 20.26.46

Netizens: ఇటీవల కొంతమంది మూగజీవాలపై క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. వాటిపై దాడి చేయడం, కొట్టి చంపుతూ అతి కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా గురుగ్రామ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంటిలో పనిచేసే పని మనిషి అత్యంత క్రూరంగా బిహేవ్ చేసింది. లిఫ్ట్‌లో కుక్కపై దారుణంగా ప్రవర్తించింది. పగ్‌ని అందుకుని లిఫ్ట్ నేలపై బలంగా ఢీకొట్టింది. మూడుసార్లు ఇలా చేసింది. దీనికి సంబంధించిన సీసీ టీవీ విజువల్స్ లిఫ్ట్ లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

గురుగ్రామ్‌లోని ఓ సొసైటీలో ఇద్దరు తండ్రీకొడుకులు జీవిస్తున్నారు. వాళ్లు రెండు విదేశీ కుక్కలను తెచ్చుకుని పెంచుకుంటున్నారు. ఇంటి పనికోసం ఒక పని మనిషిని పెట్టుకున్నారు. కుక్కలను కూడా ఈ పని మనిషే చూసుకుంటుంది. యితే బుధవారం పెంపుడు కుక్కలను పని మినిషి వాకింగ్‌కు తీసుకెళ్లింది. వాకింగ్ అయిపోయని తర్వాత తిరిగి ఇంటికి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా లిఫ్ట్ లో దారుణంగా ప్రవర్తించింది. పగ్‌ని అందుకుని నేలపై బలంగా కొట్టింది.

దీనికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పీపుల్ ఫర్ యానిమల్స్ అనే సంస్థ దృష్టికి ఈ వీడియో వెళ్లింది. దీంతో ఈ సంస్థకు చెందిన వాలంటీర్లు గురుగ్రామ్ లోని బజ్‌ఘెడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సదరు మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. చట్టప్రకారం జంతువులను హింసించడం నేరం. జంతు సంరక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నాయి. జంతువులను హింసిస్తే జైలుశిక్ష కూడా విధిస్తారు. దీంతో ఈ మహిళపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.

అయితే ఇప్పటివరకు మని పనిషిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే సొసైటీ అధికారులు మాట్లాడుతూ.. పరువు పొతుందనే భయంతో సమాచారం ఇవ్వడానిక నిరాకరించారు.ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరలు ఇంకా తెలియాల్సి ఉంది.

Exit mobile version