Site icon HashtagU Telugu

Israel Hamas War: ఇజ్రాయెల్ ప్రధానితో బ్రిటిష్ ప్రధాని రిషి సునక్ భేటీ

Israel Hamas War (2)

Israel Hamas War (2)

Israel Hamas War: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈరోజు జెరూసలెంలోని తన కార్యాలయంలో బ్రిటిష్ ప్రధాని రిషి సునక్‌తో సమావేశాన్ని నిర్వహించారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో బ్రిటిష్ ప్రధాని గురువారం ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఇజ్రాయెల్‌కు వచ్చినందుకు యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాన మంత్రి రిషి సునక్ కు ధన్యవాదాలు తెలిపారు. సునక్ మాట్లాడుతూ ఉగ్రవాద దాడుల్లో చిక్కుకున్న బ్రిటీష్ పౌరులకు అందించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలియజేసారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మీతో నేను నిలబడతాను. యుద్ధం ఫలితంగా కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన బాధితుల్ని రిషి సునక్‌ కలిసి పరామర్శించారు. యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ యూదు రాజ్యానికి సంఘీభావం తెలిపిన ఒక రోజు తర్వాత సునాక్ ఇజ్రాయెల్ పర్యటన చేపట్టారు.

Also Read: Cabbage Fry : కరకరలాడే క్యాబేజీ ఫ్రై.. సింపుల్ ఇలా చేసేయండి..