Nehru Museum: నెహ్రూ పేరు తీసేసి ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియంగా మార్పు

ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రస్, బీజేపీ మధ్య ఆసక్తికర పోరు నడుస్తుంది. కేవలం రాజకీయంగానే కాకుండా మూలలను దెబ్బ తీసే రాజకీయాలకు పాల్పడుతున్నారు.

Nehru Museum: ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రస్, బీజేపీ మధ్య ఆసక్తికర పోరు నడుస్తుంది. కేవలం రాజకీయంగానే కాకుండా మూలలను దెబ్బ తీసే రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ కాంగ్రెస్ మూలాలపై ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీకి ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ సొసైటీగా పేరు మార్చేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ పేరు మార్పుపై కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. తాజాగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్విట్టర్‌ వేదికగా బీజేపీపై మాటల తూటాలు పేల్చారు.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్విట్టర్‌లో ఇలా అన్నారు.. 59 సంవత్సరాలకు పైగా నెహ్రూ మెమోరియల్ మ్యూజియం & లైబ్రరీ (NMML) ప్రపంచ మేధోపరమైన ల్యాండ్‌మార్క్. అలాగే పుస్తకాలు & ఆర్కైవ్‌ల నిధిగా కొనసాగుతుంది. ఇక నుంచి దీనిని ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం సొసైటీగా పిలుస్తారు. అంటూ వ్యంగ్యంగా స్పందించారు. భారత దేశ-రాజ్య వాస్తుశిల్పి పేరు మరియు వారసత్వాన్ని వక్రీకరించడానికి, కించపరచడానికి మరియు నాశనం చేయడానికి మోడీ తీసుకున్న నిర్ణయం ఇది. మోడీ తన అభద్రతాభావాలతో ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు జైరాం రమేష్.

కాగా.. సొసైటీ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అధ్యక్షతన గురువారం జరిగిన ఎన్‌ఎంఎంఎల్‌ సొసైటీ ప్రత్యేక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సొసైటీకి చైర్మన్‌గా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్, జి కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్, 29 మంది సభ్యులు ఉన్నారు.

Read More: Texas Tornado: టెక్సాస్ పట్టణంలో టోర్నడో విధ్వంసం.. ముగ్గురు మృతి, 100 మందికి పైగా గాయాలు