బాలీవుడ్ లాంగ్ టైమ్ లవ్ బర్డ్స్ రణబీర్ కపూర్, ఆలియా భట్ మరికొన్ని గంటల్లో మూడు ముళ్ల బంధంతో ఒకటి కానున్నారు. వీళ్ల పెళ్లి తంతు షురూ అయ్యింది. బుధవారం ఉదయం నుంచి రణబీర్-ఆలియా పెళ్లికి సంబంధించిన పూజలు మొదలయ్యాయి. ముందుగా పితృ చేసిన తర్వాత…మెహందీ ఫంక్షన్ ప్రారంభించారు. ముంబైలోని బాంద్రాలో ఉన్న రణబీర్ ఇంట్లోనే ఈ పెళ్లి వేడుక జరగునుంది. ఈ మేరకు అక్కడ ఏర్పట్లన్నీ కూడా పూర్తయ్యాయి. గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు ఇదే నివాసంలో రణబీర్-ఆలియా వివాహ బంధంతో ఒకటి కానున్నారు. ఆ తర్వాత మూడు రోజులకు బాలీవుడ్ ప్రముఖులకు తాజ్ హెటల్ లో ఈ జంట పార్టీ ఇవ్వబోతోంది.
నీతూకపూర్, రిద్దిమా కపూర్ సాహ్ని..రణబీర్-ఆలియా వివాహం గురువారం జరుగుతుందని మీడియాతో తెలిపారు. తన కోడలు గురించి నీతూ కపూర్ ను అడిగినప్పుడు మైన్ క్యా బోలో , షీ ఈజ్ ది బెస్ట్ అంటూ చెప్పింది. ఇక మెహందీ ఫంక్షన్ కు వైట్ కలర్ శారీలో నీతూ కపూర్ దగదగ మెరిసిపోయారు. బ్లాక్ అండ్ వైట్ కలర్ సారీ లో రిద్దిమా కపూర్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ వేడుకలో కరీనాకపూర్, కరిష్మాకపూర్, కరణ్ జోహార్, పూజాభట్, మహేశ్ భట్, సోనీ రజ్దాన్ తోపాటు పలువురు ప్రముఖులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇక అటు ఇటుగా ఓ 40-45 మంది కుటుంబ సభ్యుల మధ్య గుంభనంగా రణబీర్ -ఆలియాల వివాహం జరగబోతోంది.
https://twitter.com/karanjohar/status/1514109443121635331