Site icon HashtagU Telugu

NEETPG2022: నీట్ పీజీ ప‌రీక్ష వాయిదా.. అస‌లు కార‌ణం ఇదే..!

Neet Pg 2022

Neet Pg 2022

నీట్ (నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ క‌మ్ ఎంట్ర‌న్స్ టెస్ట్) పీజీ ప‌రీక్ష‌ను కేంద్ర ప్ర‌భుత్వం వాయిదా వేసింది. దాదాపు మ‌రో ఎనిమిది వారాలు వాయిదా వేస్తూ, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణ‌యం తీసుకుంది. నిజానికి మార్చి 12న నీట్ పీజీ ఎగ్జామ్ జ‌ర‌గాల్సి ఉంది.

అయితే ఒక‌వైపు క‌రోనా ప‌ర‌స్థితులు, మ‌రోవైపు ఐదు రాష్ట్రాల్లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రుగనున్న సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా కొన్ని కార‌ణాల వ‌ల్ల‌ ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఈ నేప‌ధ్యంలో, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు వాయిదా వేసింది. నీట్ పీజీ పరీక్షను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్‌బీఈ) నిర్వహిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇక‌పోతే ఇప్ప‌టికే నీట్ పీజీ పరీక్షను కొన్నాళ్ళ పాటు వాయిదా వేయాలని, జూనియ‌ర్ డాక్ట‌ర్ల ఇంట‌ర్న్‌షిప్ పీరియ‌డ్ పూర్తికానందున, అనేకమంది ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లు, ఈ ప‌రీక్ష‌ను రాసే అవ‌కాశం కోల్పోతార‌ని, ప్ర‌స్తుతం క‌రోనా తీవ్ర‌త నేప‌ధ్యంలో కోవిడ్ విధులు నిర్వ‌ర్తిస్తున్న నేప‌ధ్యంలో ఆలామంది ఈ మాండేట‌రీ ఇంట‌ర్న్‌షిప్‌ను పైర్తి చేయ‌లేక‌పోయార‌ని, ప‌లువురు ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లు జ‌న‌వ‌రి 25న సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. దీంతో ఈ పిటీష‌న్ల పై సుప్రీంకోర్టు నేడు విచార‌ణ జ‌రుపుతుందని స‌మాచారం. అయితే ఇప్ప‌టికే నీట్ పీజీ ప‌రీక్ష మార్చి 12న జ‌ర‌గాల్సి ఉండ‌గా, మే నెల‌లో జ‌రపాల‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణ‌యించ‌డం గ‌మ‌నార్హం.