Site icon HashtagU Telugu

NEET PG Entrance Exam: మరో పరీక్ష వాయిదా.. ఎన్టీఏ డీజీ సుబోధ్ కుమార్ సింగ్‌పై వేటు..!

SSC CHSL Exam 2024

SSC CHSL Exam 2024

NEET PG Entrance Exam: దేశంలోని ప్రధాన పరీక్షలు రద్దు చేస్తున్నారు. ఈ క్రమంలోనేలఅ మరో పరీక్ష (NEET PG Entrance Exam) వాయిదా పడింది. నీట్-పీజీ ప్రవేశ పరీక్ష కూడా వాయిదా పడింది. ఈ పరీక్ష ఆదివారం జరగాల్సి ఉంది. ఇప్పటి వరకు ఒక్క నెలలో 5 పరీక్షలు రద్దయ్యాయి. దీనిపై విద్యార్థుల్లో ఆగ్రహం, ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి.

NEET-PG ప్రవేశ పరీక్ష వాయిదా

జూన్ 23న దేశవ్యాప్తంగా నీట్ ప్రవేశ పరీక్ష జరగాల్సి ఉంది. గతంలో సంబంధిత మంత్రిత్వ శాఖ ఈ పరీక్షను వాయిదా వేసింది. ఈ పరీక్ష కొత్త తేదీ త్వరలో విడుదల కానుంది. ఇటీవల కొన్ని పోటీ పరీక్షల పారదర్శకత, సమగ్రతపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. NEET-PG ప్రవేశ పరీక్షా విధానాల పటిష్టతను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పూర్తిగా మూల్యాంకనం చేస్తుంది.

మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు

పరీక్షను రద్దు చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నాన్-బయోలాజికల్ PM, అతని చుట్టూ ఉన్న వ్యక్తుల పూర్తి అసమర్థత కారణంగా పరీక్ష రద్దు వార్త లేకుండా ఏ రోజు పూర్తి కావటం లేదు. రేపు జరగాల్సిన నీట్-పీజీ పరీక్ష వాయిదా పడింది అని విమర్శించారు.

Also Read: AP TDP: రాజకీయ చరిత్రలో ఏ మచ్చ లేని నాయకులు అయ్యన్నపాత్రుడు

ముందుగా నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీని తర్వాత నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (NCET) 2024, UGC NET పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత యూజీసీ నెట్‌, నీట్‌ పీజీ ప్రవేశ పరీక్షలకు సీఎస్‌ఐఆర్‌ వాయిదా వేసింది. రెండు పరీక్షలను ఒక్కరోజు గ్యాప్‌తో వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

We’re now on WhatsApp : Click to Join

డీజీ సుబోధ్ కుమార్ సింగ్‌పై వేటు

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) డీజీ సుబోధ్ కుమార్ సింగ్‌పై కేంద్ర ప్రభుత్వం వేటు వేసింది. పదవి నుంచి తొలగించి వెయిటింగ్‌లో పెట్టింది. తాజాగా UGC-NET, NEET పరీక్షల నిర్వహణలో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ ఎండీగా ఉన్న కేరళ క్యాడర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ సింగ్ ఖరోలాకు ఎన్టీఏ-డీజీగా అదనపు బాధ్యతలు ఇచ్చారు.