NEET PG 2024 Exam Date: నీట్ పీజీ ప‌రీక్ష ఎప్పుడంటే..? ఎగ్జామినేష‌న్ చైర్మ‌న్ ఏం చెప్పారంటే..?

NEET PG 2024 Exam Date: నీట్ పీజీ పరీక్షకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది. నీట్ పీజీ పరీక్ష తేదీ (NEET PG 2024 Exam Date)ని త్వరలో ప్రకటించే అవ‌కాశం ఉంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. కొత్త పరీక్ష తేదీని వచ్చే వారం ప్రకటించనున్నారు. వచ్చే వారం చివరిలోపు తేదీని ప్రకటిస్తామని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్‌బీఈ) చైర్మన్ డాక్టర్ అభిజత్ సేథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రణాళికను విద్యాశాఖ […]

Published By: HashtagU Telugu Desk
NEET PG 2024 Exam Date

NEET PG 2024 Exam Date

NEET PG 2024 Exam Date: నీట్ పీజీ పరీక్షకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది. నీట్ పీజీ పరీక్ష తేదీ (NEET PG 2024 Exam Date)ని త్వరలో ప్రకటించే అవ‌కాశం ఉంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. కొత్త పరీక్ష తేదీని వచ్చే వారం ప్రకటించనున్నారు. వచ్చే వారం చివరిలోపు తేదీని ప్రకటిస్తామని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్‌బీఈ) చైర్మన్ డాక్టర్ అభిజత్ సేథ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రణాళికను విద్యాశాఖ ఆమోదం కోసం పంపామని, అక్కడి నుంచి ఆమోదం రాగానే కొత్త తేదీ గురించి విద్యార్థులకు తెలియజేస్తామని డాక్టర్ సేథ్ తెలిపారు. 2 నెలల్లో మొత్తం అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని భావిస్తున్నామని తెలిపారు. నీట్ పీజీ పరీక్ష జూన్ 22న జరగాల్సి ఉందని, అయితే పరీక్ష ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు ఈ పరీక్ష రద్దయిందని మ‌న‌కు తెలిసిందే.

Also Read: Credit Card Rule: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వినియోగ‌దారుల‌కు బిగ్ షాక్‌.. జూలై నుంచి ఈ సేవ‌లు బంద్‌..!

NEET PG 2024 పరీక్ష ఎందుకు రద్దు చేశారు..?

పేపర్‌కు 12 గంటల ముందు నీట్ పీజీ పరీక్ష ఎందుకు రద్దు చేయబడిందనే దానిపై పేపర్ లీక్ లేదా మరే ఇతర సమస్య గురించి ఎటువంటి నివేదిక లేదని NBE చైర్మన్ చెప్పారు. విద్యా మంత్రిత్వ శాఖ పరీక్ష ప్రక్రియను సరిగ్గా తనిఖీ చేయాలనుకున్నందున పేపర్ రద్దు చేసింద‌ని చెప్పారు. NTA అనేక పరీక్షలను రద్దు చేసినందున ఈసారి పరిస్థితి చాలా సున్నితంగా ఉన్నందున మొత్తం ప్రక్రియలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా చూడాలని కోరుకుంటున్నట్లు ఆయ‌న తెలిపారు.

We’re now on WhatsApp : Click to Join

నీట్ పీజీ పరీక్షలో పేపర్ లీక్ అయ్యే అవకాశం లేదని, ఎందుకంటే ఈసారి పరీక్ష కంప్యూటర్ బెస్ట్ టెస్ట్ (సీబీటీ) ఫార్మాట్‌లో నిర్వహించనున్న‌ట్లు ఆయన తెలిపారు. ఈ పరీక్ష ఆన్‌లైన్‌లో ఉంటుంది. కాబ‌ట్టి ప్రశ్నపత్రం ఎక్కడా ప్రచురించే అవ‌కాశం లేదు. అయితే, గ‌త ఎగ్జామ్ వాతావరణంలో విద్యార్థులను ఎవరైనా తమకు అనుకూలంగా మలుచుకుని ఉత్తీర్ణత సాధిస్తామనే సాకుతో వారి నుంచి డబ్బులు వసూలు చేస్తారేమోనని అధికారులు భయపడ్డారు. దీంతో పేపర్‌ రద్దు వంటి కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని ఆయ‌న తెలిపారు.

  Last Updated: 29 Jun 2024, 11:13 AM IST