Site icon HashtagU Telugu

Result: నీట్ పీజీ రౌండ్ 1 సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..!

NEET UG result 2025

NEET UG result 2025

Result: మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) సోమవారం నీట్ పీజీ (NEET PG 2023) మొదటి రౌండ్ కౌన్సెలింగ్ కోసం సీట్ల కేటాయింపు ఫలితాల (Result)ను ప్రకటించింది. ఆల్ ఇండియా కోటా సీట్ల కోసం పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG 2023) కౌన్సెలింగ్ కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్‌లో హాజరైన అభ్యర్థులు mcc.nic.inని సందర్శించడం ద్వారా సీట్ల కేటాయింపు ఫలితాలను తనిఖీ చేయవచ్చు. ఇది కాకుండా, అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన దశల ద్వారా ఫలితాలను తనిఖీ చేయవచ్చు.

కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం ఎంపికైన అభ్యర్థులు ఆగస్టు 8న MCC పోర్టల్‌లో తమ డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయాలి. 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు కేటాయించిన ఇన్‌స్టిట్యూట్‌లో రిపోర్ట్/జాయిన్ అవ్వాలి. ఆగస్టు 15- 17 మధ్య హాజరైన అభ్యర్థుల డేటాను ధృవీకరించాలని, దానిని MCCతో పంచుకోవాలని ఇన్‌స్టిట్యూట్‌లను కోరింది. ఇన్‌స్టిట్యూట్‌లు ఆగస్టు 15 -17 మధ్య హాజరైన అభ్యర్థుల డేటాను ధృవీకరించి, MCCతో షేర్ చేస్తాయి. MCC NEET PG 2023 కౌన్సెలింగ్ రౌండ్ 2 రిజిస్ట్రేషన్‌ను ఆగస్టు 17న ప్రారంభిస్తుంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 25. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను చూడవచ్చు.

Also Read: Hindu Population: హిందువుల శాతం అధికంగా ఉన్న దేశం ఏదో తెలుసా..?! ఇండియాకు రెండో స్థానం.. మొదటి స్థానంలో ఉన్న దేశం ఇదే..!

PG కౌన్సెలింగ్ 2023 రౌండ్ 1 సీట్ల కేటాయింపు ఫలితాలను చెక్ చేయండిలా..!

స్టెప్ 1: ముందుగా అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్ mcc.nic.inకి వెళ్లండి.
స్టెప్ 2: ఇప్పుడు అభ్యర్థి హోమ్‌పేజీలో PG కౌన్సెలింగ్ లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: ఇప్పుడు రౌండ్ 1 సీటు కేటాయింపు కోసం లింక్‌ను తెరవండి.
స్టెప్ 4: అభ్యర్థులు అవసరమైన ఆధారాలతో లాగిన్ అవ్వండి.
స్టెప్ 5: ఆ తర్వాత NEET PG సీట్ల కేటాయింపు ఫలితం అభ్యర్థి స్క్రీన్‌పై కనిపిస్తుంది.
స్టెప్ 6: అభ్యర్థులు దీన్ని డౌన్‌లోడ్ చేసుకోండి.
స్టెప్ 7: చివరగా, ఆ పేజీ నుండి ప్రింట్ అవుట్ తీసుకోండి.