Site icon HashtagU Telugu

Dharmendra Pradhan: కేంద్రమంత్రికి చేదు అనుభవం.. సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్‌!

Dharmendra Pradhan

Dharmendra Pradhan

Dharmendra Pradhan: 18వ లోక్‌సభ తొలి సెషన్‌లో నేడు తొలిరోజు. ప్రొటెం స్పీకర్‌ ప్రమాణ స్వీకారం అనంతరం 10.30 గంటలకు సభా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ముందుగా ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవం ప్రారంభమైంది. సభా నాయకుడిగా మొట్టమొదట ప్రమాణం చేశారు ప్రధాని మోదీ. అనంతరం రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు ఒక్కొక్కరుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు వచ్చారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) ప్రమాణ స్వీకారానికి రాగానే ప్రతిపక్షాలు నీట్‌-నీట్‌ అంటూ నినాదాలు చేశారు. విపక్ష ఎంపీలంతా ఆయనను తీవ్రంగా వ్యతిరేకించారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎంపీగా ప్రమాణం చేసేందుకు పోడియం వద్దకు వెళ్లి ప్రమాణం చేసొచ్చే వరకూ విపక్ష సభ్యులు ‘నీట్.. నీట్’ అని అరిచారు. విద్యాశాఖ మంత్రి ఒరియాలో ప్రమాణస్వీకారం చేశారు. నీట్ పేపర్ లీక్ 2024 గురించి ప్రతిపక్షాలు బీజేపీ, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుంటున్నాయి. అయితే, నష్ట నియంత్రణ కోసం ప్రభుత్వం యాంటీ పేపర్ లీక్ చట్టాన్ని నోటిఫై చేసింది. మరోవైపు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. పాట్నా, గోద్రాకు రెండు సీబీఐ బృందాలు చేరుకున్నాయి. మొత్తం మీద నీట్ పేపర్ లీక్ కేసులో చిక్కుల్లో పడిన ఎన్టీఏపై కూడా ప్రభుత్వం సమీక్షిస్తోంది.

Also Read: Adani AGM 2024: అదానీ సంస్థ పిల్లర్ ని కూడా కడపలేరు: గౌతమ్ అదానీ

విపక్ష ఎంపీలు రాజ్యాంగ ప్రతిని తీసుకుని వచ్చారు

అంతకుముందు విపక్ష ఎంపీలందరూ తమ చేతుల్లో రాజ్యాంగ ప్రతులను పట్టుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వం తొలిరోజు నుంచి అహంకారంలో మునిగిపోయిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మొదటి రోజు నుంచే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటూ నినాదాలు చేశారు. ఎంపీల ప్రమాణ స్వీకారం తర్వాత లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగాల్సి ఉంది. అనంతరం రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. సభలో బడ్జెట్‌పై చర్చ అనంతరం చివరి రోజు ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ప్రధాని మోదీ సమాధానం ఇస్తారు. ఈ తొలి సెషన్ జూలై 3తో ముగుస్తుంది.

We’re now on WhatsApp : Click to Join

ప్రొటెం స్పీకర్ విషయంలో వివాదం

ప్రొటెం స్పీకర్ నియామకంపై కూడా వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. సభ ప్రారంభం కావడానికి ముందు కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగోయ్‌ మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం ఇంకా అహంభావంతోనే ఉందని అన్నారు. ప్రభుత్వం ప్రతిపక్ష ఎంపీని ప్రొటెం స్పీకర్‌గా నియమించి ఉంటే.. సంప్రదాయం పాటించిన‌ట్లు ఉండేద‌న్నారు.