Site icon HashtagU Telugu

Neera Cafe: తెలంగాణలో తొలిసారిగా ‘నీరా’ కేఫ్ !

Neera

Neera

దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో రూ.25 కోట్లతో నీరా కేఫ్‌ను ఏర్పాటుచేస్తున్నట్టు ఎక్సైజ్‌, ప్రొహిబిషన్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. హైదరాబాద్ PVNR మార్గ్‌లోని నీరా కేఫ్‌లో పనులను పరిశీలించిన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. నీరా, టోడీ 15 రకాల వ్యాధులను అరికట్టడంలో సహాయపడతాయని, ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని, ఇది మంచి ఔషధంలా పనిచేస్తుందని అన్నారు. కల్లుగీత కార్మికులపై కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్న రాజకీయ నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని గౌడ్ సంఘం ప్రతినిధులకు మంత్రి పిలుపునిచ్చారు. గీతకార్మికులు  ప్రమాదవశాత్తు మరణిస్తే ఎక్స్‌గ్రేషియా అందించేందుకు చర్యలు  తీసుకుంటున్నామన్నారు. ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు. నీరాను ప్రోత్సహించేందుకు, ప్రాచుర్యం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కేఫ్ ప్రాజెక్టును తీసుకొచ్చిందని తెలిపారు.