Site icon HashtagU Telugu

Assam Floods: అస్సాంలో విస్తృతంగా వర్షాలు.. భారీ ఆస్థి నష్టం

Assam Floods

New Web Story Copy 2023 09 03t233844.743

Assam Floods: దేశంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. దేశంలో పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. ఆయా రాష్ట్రాల్లో ఈ పరిస్థితి మరింత ఉదృతంగా కనిపిస్తుంది. అస్సాంలో భారీ వర్షాల కారణంగా ఏడు జిల్లాలో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఏడు జిల్లాల్లో 1.22 లక్షల మంది ప్రజలు వరదలో చిక్కుకున్నారు. ఆదివారం వరద పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని అధికారిక బులెటిన్ తెలిపింది.అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ASDMA) రోజువారీ వరద నివేదిక ప్రకారం, బార్‌పేట, చిరాంగ్, దర్రాంగ్, గోలాఘాట్, కమ్రూప్ మెట్రోపాలిటన్, మోరిగావ్ మరియు నాగావ్ జిల్లాల్లో వరదల కారణంగా 1,22,000 మందికి పైగా ప్రజలు నష్టపోయారు. శనివారం వరకు 13 జిల్లాల్లో దాదాపు 2.43 లక్షల మంది వరదల బారిన పడ్డారు.. రాష్ట్రంలో ఎక్కడా కొత్త మరణాలు నమోదు కాకపోవడంతో మరణాల సంఖ్య 18కి చేరింది.దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. మూడు జిల్లాల్లో ఏడు సహాయ శిబిరాలను ఏర్పాటు చేసింది, రాష్ట్రవ్యాప్తంగా 583 గ్రామాలు నీటమునిగాయని, 8,592.05 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని తెలుస్తుంది. . దర్రాంగ్ మరియు మోరిగావ్‌లలో వరద నీటితో కట్టలు, రోడ్లు, వంతెనలు మరియు ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ధుబ్రి వద్ద బ్రహ్మపుత్ర ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. భారీ వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 97,400 పెంపుడు జంతువులు మరియు పౌల్ట్రీ ప్రభావితమయ్యాయి.

Also Read: Ajith-Shalini : అజిత్‌, షాలిని లవ్ కోడ్ ఏంటో తెలుసా..? సీక్రెట్‌గా ప్రేమించుకుంటున్న టైంలో..