Site icon HashtagU Telugu

PM Museum : పీఎం మ్యూజియం

Modi Museum

Modi Museum

భార‌త ప్ర‌ధానుల సేవ‌ల‌ను తెలియ‌చేస్తూ ఒక మ్యూజియంను కేంద్రం రూపొందించింది. నెహ్రూ మ్యూజియంలోని ప్ర‌ధాని మంత్రి సంగ్ర‌హాల‌య (పీఎం మ్యూజియం) వ‌చ్చే నెల 14న ప్రారంభం కానుంది. ఆ విష‌యాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎంపీలతో స‌మావేశ‌మైన సంద‌ర్భంగా వెల్ల‌డించాడు. భార‌త దేశానికి ఎన్నికైన‌ 14 మంది మాజీ ప్రధానుల సేవలను గుర్తించడానికి ఎన్‌డిఎ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నెహ్రూ మ్యూజియంలోని “ప్రధాని మంత్రి సంగ్రహాలయ (PM మ్యూజియం)లో వాళ్ల సేవ‌ల‌ను చూడొచ్చు. మాజీ ప్రధానుల కృషిని తెలియ‌చేయ‌డానికి ఈ మ్యూజియం ఉప‌యుక్తంగా ఉంది. బీఆర్ అంబేద్కర్ మ్యూజియం సందర్శించాలని బీజేపీ ఎంపీలను ప్రధాని మోదీ కోరారు. అంబేద్కర్ మ్యూజియం కూడా ఏప్రిల్ 14న దేశ రాజధానిలో బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రారంభం కానుంది. న్యూఢిల్లీలోని అంబేద్కర్ సెంటర్‌లో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజ‌రైన మోడీ ఆ మేర‌క ప్ర‌క‌టించాడు. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా తదితరులు స‌మావేశానికి హాజరయ్యారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ఏప్రిల్ 6 నుండి బిఆర్ అంబేద్కర్ జయంతి రోజు ఏప్రిల్ 14 వరకు బిజెపి వరుస కార్యక్రమాలను నిర్వహించ‌నుంది.