IND vs SL 2nd ODI: శ్రీలంక ఆల్ ఔట్.. భారత్ లక్ష్యం 216

బ్యాటింగ్ చేసిన శ్రీలంక కేవలం 39.4 ఓవర్లకు 215 పరుగులు చేసి అలౌట్ అయ్యింది.

Published By: HashtagU Telugu Desk
Team India

Indian Team

ఇండియా వర్సెస్ శ్రీలంక (India vs Sri Lanka) జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా రెండో వన్డే ఇవాళ జరుగుతోంది. తొలి మ్యాచ్‌లో భారీ విజయం సాధించిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లోనూ భారీ విజయాన్ని సాధించి వన్డే సిరీస్‌ను తన ఖతాలో వేసుకొనేందుకు సిద్ధమైంది. తొలిమ్యాచ్ లో కీలక బ్యాట్స్‌మెన్ అందరూ ఫామ్‌ను ఉండటం భారత్ కు కలిసొచ్చే ప్రధాన అంశం. ఎనిమిదేళ్ల క్రితం ఇండియా, శ్రీలంక జట్లు చివరిసారి ఈడెన్ గార్డెన్స్‌లో తలపడ్డాయి.

కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్‌లో (Eden Gardens) మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక కేవలం 39.4 ఓవర్లకు 215 పరుగులు చేసి అలౌట్ అయ్యింది. భారత బౌలర్లు అద్భుతంగా రాణించడంతో శ్రీలంక తక్కువ పరుగులకే పరిమితమైంది. కేవలం ఫెర్నాండో మాత్రమే హాఫ్ సెంచరీ సాధించి గౌరవ ప్రదమైన స్కోరు అందించాడు. ఇక భారత్ 216 లక్ష్యంతో బ్యాటింగ్ మొదలు పెట్టబోతోంది. అయితే రోహిత్ (Rohit sharma) ప్రపంచ రికార్డు స్కోరు (264) సాధించాడు. ఈ సారికూడా రోహిత్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. చివరిసారిగా 2020 జనవరిలో వన్డేల్లో ఆస్ట్రేలియాపై సెంచరీ సాధించిన రోహిత్.. చాలాకాలం తరువాత ఈడెన్‌లో సెంచరీ చేస్తాడో లేదో వేచి చూడాల్సిందే.

  Last Updated: 12 Jan 2023, 05:06 PM IST