Site icon HashtagU Telugu

NCW React: రేప్ ఘటనలపై ‘ఎన్సీడబ్ల్యూ’ సీరియస్!

Ncw

Ncw

హైదరాబాద్ మైనర్ గ్యాంగ్ రేప్ ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. ఈ ఇష్యూ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మైనర్ గ్యాంగ్ రేప్ ఘటన తర్వాత మరో రెండు గ్యాంగ్ రేప్ లు వెలుగులోకి రావడంతో హైదరాబాద్ పై విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో భాగ్యనగరంలో పెరుగుతున్న నేరాల పట్ల జాతీయ మహిళా కమిషన్ (NCW) మండిపడింది. గ్యాంగ్ రేప్ ఘటన ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వెంటనే రిపోర్ట్ పంపాలని తెలంగాణ పోలీసులను కోరింది. వారం వ్యవధిలో హైదరాబాద్ లో మైనర్ బాలికలపై ఐదు అత్యాచార కేసులు నమోదయ్యాయని ఒక కథనం వచ్చినట్లు NCW ఒక ప్రకటనలో తెలిపింది.

తెలంగాణలోని హైదరాబాద్ జిల్లాలో బాలికలు, మహిళలపై “పెరుగుతున్న అత్యాచారాల” రేటును కమిషన్ తీవ్రంగా పరిగణించింది. “పోలీసుల పాత్ర నేరాలను అరికట్టడం, నిరోధించడం మాత్రమే కాదు.. అలాంటి విషయాలలో వేగంగా తగిన చర్యలు తీసుకోవాలి” అని NCW స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్‌సిడబ్ల్యు చైర్‌పర్సన్ రేఖా శర్మ స్పందిస్తూ.. అమ్మాయిలు, మహిళల భద్రతకు రాష్ట్రం తీసుకున్న చర్యలపై వివరణాత్మక నివేదికను ఏడు రోజుల్లో పంపాలని తెలంగాణ పోలీసు డైరెక్టర్ జనరల్‌కు లేఖ రాశారు. మీడియా కథనాల ప్రకారం, సోమవారం తెరపైకి వచ్చిన రెండు కేసులలో మొదటిది రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్‌లో, రెండవది రాజేందర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైంది. ఆదివారం తెల్లవారుజామున మైనర్లపై రెండు కొత్త అత్యాచార కేసులు వెలుగులోకి వచ్చాయి. కాగా గత నెలలో పార్టీ కోసం పబ్‌కు వచ్చిన ఒక టీనేజ్ బాలికపై ముగ్గురు యువకులు సహా ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

Exit mobile version