NBK: దిల్ రాజ్ బ్యానర్ లో బాలయ్య మూవీ.. ఛాన్స్ కొట్టేసిన శ్రీకాంత్ అడ్డాల

నందమూరి బాలకృష్ణ నటించిన తాజా సెన్సేషన్ చిత్రం 'అఖండ'. ఈ మూవీతో బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్నారు. ఈ రోజుల్లో రెండు వారాలు ఆడితే చాలు సినిమా బంపర్ హిట్ అని చెప్పుకునే పరిస్థితులను మనం చూస్తున్నాం.

  • Written By:
  • Updated On - February 2, 2022 / 11:21 AM IST

నందమూరి బాలకృష్ణ నటించిన తాజా సెన్సేషన్ చిత్రం ‘అఖండ’. ఈ మూవీతో బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్నారు. ఈ రోజుల్లో రెండు వారాలు ఆడితే చాలు సినిమా బంపర్ హిట్ అని చెప్పుకునే పరిస్థితులను మనం చూస్తున్నాం. అలాంటిది కరోనా సిట్యుయేషన్ లోనూ ‘అఖండ’ మూవీ 103 థియేటర్లలో… 50 రోజులను పూర్తిచేసుకోవడం అంటే మాటలు కాదు. ఓటీటీ ప్లాట్ ఫాం లోనూ ‘అఖండ’ సినిమా తన ప్రభంజనాన్ని కొనసాగిస్తోంది. అన్ని వర్గాల ప్రజలు ఈ సినిమాకి బ్రహ్మరధం పట్టారనే చెప్పాలి. ‘అఖండ’ ఇచ్చిన కిక్ తో బాలయ్య వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. నందమూరి బాలకృష్ణ నెక్ట్స్ మూవీని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ, అనిల్ రావిపూడి, పూరి జగన్నాథ్ లైన్లో ఉన్నట్టుగా సినిమా సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఏంటంటే… ‘కొత్త బంగారు లోకం’ సినిమా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఒక కథని బాలయ్యను కలిసి చెప్పాడట.

ఆ కథ నచ్చడంతో బాలకృష్ణ వెంటనే శ్రీకాంత్ అడ్డాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘బాలయ్య – అడ్డాల’ కాంబో మూవీకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. శ్రీకాంత్ అడ్డాల రాసిన కథ విన్న నిర్మాత దిల్ రాజు… ఈ కథ బాలయ్యకు అయితేనే సెట్ అవుతుందని చెప్పి, నందమూరి బాలకృష్ణ దగ్గరికి శ్రీకాంత్ అడ్డాలను పంపించారట. దీంతో ఈ కాంబినేషన్ వర్కౌట్ అయిందట. ఇక శ్రీకాంత్ అడ్డాలకు దర్శకుడిగా ప్రయాణం మొదలైందే దిల్ రాజు బ్యానర్ లో. దిల్ రాజు నిర్మించిన ‘కొత్త బంగారు లోకం’ సినిమాతోనే. ఆ తరువాత ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం బాలకృష్ణను లైన్లో పెట్టేశారు శ్రీకాంత్ అడ్డాల. అయితే ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కేది తెలియాల్సి ఉంది. ‘అఖండ’ ను మించి హిట్ కొట్టేలా దిల్ రాజు ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.