Site icon HashtagU Telugu

Visakha: విశాఖ సాగర తీరంలో నేవీ డే రిహార్సల్స్

Visakha

Visakha

నేవీ డే వేడుకలకు విశాఖ తీరం ముస్తా బవుతోంది. ఆర్కే బీచ్‌లో యుద్ధనౌకలు, నేవీ హెలికాప్టర్లతో విన్యాసాలు అదుర్స్ అనిపిస్తున్నాయి. డిసెంబర్ 4న జరిగే నేవీ డే వేడుకలకు ఆర్కే బీచ్‌లో కొద్ది రోజులుగా ముమ్మరంగా రిహార్సల్స్‌ నిర్వహిస్తున్నారు. సముద్రంలో యుద్ధనౌకలు, హెలికాప్టర్ల విన్యాసాలను చూసేందుకు విశాఖ నగర వాసులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు బీచ్‌కు చేరుకుంటున్నారు.

దీంతో ఆర్కే బీచ్ సందడిగా మారింది. యుద్ధ సమయంలో నావికాదళం ఎలా స్పందిస్తుంది.. శత్రువులపై ఎలా ఎదురు దాడికి దిగుతుందో.. కళ్లకు కట్టినట్లు చూపించారు. తీరానికి వచ్చిన సందర్శకులు ఈ విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు.

L