Site icon HashtagU Telugu

Navjot Singh Sidhu: పంజాబ్ పీసీసీ పదవికి.. నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా..!

Navjot Singh Sidhu

Navjot Singh Sidhu

పీసీసీ చీఫ్ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాల మేరకు ఆయన రాజీనామా చేశారు. ఇక ఇటీవల పంజాబ్‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. పంజాబ్ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్ర‌భంజ‌నం సృష్టించ‌డంతో, అక్క‌డి సిట్టింగ్ సీఎం చరణ్ జిత్ చన్నీతో పాటు, పీసీసీ చీఫ్ పదవికి నవజ్యోత్ సిద్ధూలు ఘోరంగా ఓట‌మి పాలయ్యారు.

ఈ నేప‌ధ్యంలో ఐదేళ్లపాటు పంజాబ్‌లో అధికారంలో ఉండి కూడా, తాజా ఎన్నిక‌ల్లో అక్క‌డ‌ కనీస స్థానాలను సాధించలేకపోయిన కాంగ్రెస్ కేవలం 18 స్థానాలకే పరిమితమ‌య్యింది. ఈ క్ర‌మంలో తాజాగా ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సమీక్షించిన సోనియా గాంధీ, వెంట‌నే ఐదు రాష్ట్రాల పీసీసీ చీఫ్‌ల‌ను రాజీనామా చేయాలని ఆదేశించారు. ఈ మేరకు న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్ర‌మంలో త‌న రాజీనామా లేఖను హైకమాండ్‌కు పంపిన సిద్ధూ, ఈ లేఖను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.