Navjot Singh Sidhu: శిక్ష పూర్తి కాకుండానే జైలు నుంచి విడుదలైన నవజ్యోత్ సింగ్ సిద్ధూ

పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu) శనివారం పాటియాలాలోని సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ సమాచారం సిద్ధూ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి షేర్ చేయబడింది.

  • Written By:
  • Publish Date - April 1, 2023 / 02:00 PM IST

పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu) శనివారం పాటియాలాలోని సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ సమాచారం సిద్ధూ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి షేర్ చేయబడింది. విడుదల గురించి జైలు అధికారులు తెలియజేసినట్లు తెలిపారు. 59 ఏళ్ల కాంగ్రెస్ నాయకుడు 1988 నాటి రోడ్డు రేజ్ కేసులో ఏడాది జైలు శిక్ష అనుభవిస్తున్నారు. గత ఏడాది మే 20న సుప్రీం కోర్టు అతనికి ఏడాది కఠిన కారాగార శిక్ష విధించడంతో సిద్ధూ పాటియాలాలోని కోర్టులో లొంగిపోయాడు.

శిక్షాకాలం పూర్తయ్యే 48 రోజుల ముందు సిద్ధూ విడుదల అయ్యారు. సిద్ధూ పెరోల్ తీసుకోలేదని, సెలవు తీసుకోలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అందుకే ముందుగానే విడుదల చేస్తున్నారు. శిక్షలు పూర్తి చేసుకున్న ఖైదీల విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని పంజాబ్ మంత్రి బ్రహ్మ్ శంకర్ జింపా శుక్రవారం తెలిపారు. ముందుగా జనవరి 26న సిద్ధూని విడుదల చేయాలనే చర్చ తెరపైకి వచ్చింది. అయితే ఆ తర్వాత పంజాబ్ ప్రభుత్వం సిద్ధూకి ఎలాంటి మినహాయింపు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఆయన విడుదల వాయిదా పడింది.

Also Read: Rajya Sabha MP Sanjay Raut: ఏకే- 47తో కాల్చి చంపుతానని సంజయ్ రౌత్ కు బెదిరింపు

డిసెంబరు 27, 1988న పాటియాలా నివాసి గుర్నామ్ సింగ్‌ను వీధి గొడవ సమయంలో సిద్ధూ తలపై బలంగా కొట్టాడు. ఈ దాడిలో గాయపడిన గుర్నామ్ సింగ్‌ చికిత్స పొందుతూ మరణించాడు. సెప్టెంబరు 22, 1999న పాటియాలా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఈ కేసులో సాక్ష్యాధారాలు, సందేహాల ప్రయోజనం కారణంగా సిద్ధూ, అతని సహచరులను నిర్దోషులుగా ప్రకటించారు. 2006లో పంజాబ్, హర్యానా హైకోర్టు సిద్ధూను దోషిగా నిర్ధారించి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఉత్తర్వులను సిద్ధూ సుప్రీం కోర్టులో సవాలు చేశారు. గత ఏడాది మే 19, 2022న మూడు దశాబ్దాల నాటి రోడ్ రేజ్ కేసులో సిద్ధూకి సుప్రీంకోర్టు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. ఇదిలా ఉంటే సిద్ధూ భద్రతకు సంబంధించి పెద్ద వార్త తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ నేతకు Z+ భద్రతను తగ్గిస్తూ ఆయనకు Y భద్రతను కల్పించారు.