Navi Technologies: ఉద్యోగులకు షాకిచ్చిన నవీ టెక్నాలజీ.. ఒకేసారి అంతమంది ఉద్యోగులను తొలగింపు?

ప్రస్తుతం ఒకవైపు కంపెనీలు ఉద్యోగులకు శుభవార్తలు చెబుతుండగా మరి కొన్ని కంపెనీలు ఉద్యోగులకు ఊహించని విధంగా షాక్ లు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే

  • Written By:
  • Publish Date - July 13, 2023 / 05:30 PM IST

ప్రస్తుతం ఒకవైపు కంపెనీలు ఉద్యోగులకు శుభవార్తలు చెబుతుండగా మరి కొన్ని కంపెనీలు ఉద్యోగులకు ఊహించని విధంగా షాక్ లు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ స్టార్టప్ కంపెనీ నవీ టెక్నాలజీ కూడా ఉద్యోగులకు ఒక పెద్ద షాక్ ఇచ్చింది. ఇందులో భాగంగానే తాజాగా 200 మంది ఉద్యోగులను తొలగించింది. ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకుడు అయిన సచిన్ బన్సల్ నేతృత్వంలో ఉండే నవీ టెక్నాలజీ కంపెనీ తాజాగా 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు వెల్లడించింది.

ఇందులో దాదాపు 60 నుంచి 70 శాతం మంది ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ విభాగానికి చెందిన వారు కావడం గమనార్హం. కాగా మిగిలిన ఉద్యోగులు వివిధ విభాగాలకు చెందిన వారు అని తెలుస్తోంది. అయితే కంపెనీ రానున్న రోజుల్లో మరింత మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని సమాచారం. దీంతో ఉద్యోగులు బిక్కుబిక్కుమంటున్నారు. కాగా 2021 డిసెంబర్ నాటికి ఈ సంస్థలో ఉన్న ఉద్యోగుల సంఖ్య 4,680 మంది. కానీ గత కొన్ని రోజులుగా తొలగింపులు ప్రక్రియ మొదలైంది. దాంతో ఈ సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది.

కేవలం ఈ కంపెనీ మాత్రమే కాకుండా ఈ ఏడాది పెద్ద పెద్ద కంపెనీలు సైతం తమ ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సమయాన ఎవరిని తీసేస్తారు అని ఉద్యోగులు భయపడుతున్నారు. అయితే త్వరలోనే ఈ కంపెనీ నుంచి మరి కొంతమంది ఉద్యోగులను తొలగించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై కంపెనీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి..