Site icon HashtagU Telugu

LSG vs MI: బంతితో విధ్వంసం సృష్టించిన నవీన్-ఉల్-హక్

LSG vs MI

Fotojet 9 2 758x460

LSG vs MI: ఐపీఎల్ 2023లో ఇప్పటివరకు వివాదాల కారణంగా వెలుగులోకి వచ్చిన నవీన్-ఉల్-హక్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో బంతితో విధ్వంసం సృష్టిస్తున్నాడు. తన కిల్లర్ బౌలింగ్‌తో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఆర్డర్ వెన్ను విరిచాడు. నవీన్ ఒకే ఓవర్లో సూర్యకుమార్ యాదవ్, కెమరూన్ గ్రీన్‌లను పెవిలియన్ పంపించేశాడు.

చెపాక్ స్టేడియంలో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ ఫాస్ట్ బౌలర్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 11 పరుగుల స్కోరు వద్ద ముంబై కెప్టెన్ రోహిత్ శర్మను నవీన్ పెవిలియన్ సాగనంపాడు. రోహిత్ అవుటైన తర్వాత సూర్యకుమార్ యాదవ్ మరియు కెమెరూన్ గ్రీన్ నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో ముంబై స్కోర్ బోర్డును ఇద్దరి భాగస్వామ్యంతో పరుగులు పెట్టించారు. ఈ సమయంలో కెప్టెన్ కృనాల్ తెలివిగా 11వ ఓవర్‌ ను నవీన్‌కి అందించాడు

కెప్టెన్ కృనాల్ నమ్మకాన్ని నవీన్ నిలబెట్టుకున్నాడు. 11వ ఓవర్ నాలుగో బంతికి సూర్యకుమార్ యాదవ్ ను పెవిలియన్ పంపించి ముంబైని కష్టాల్లోకి నెట్టాడు. సూర్య 20 బంతుల్లో 33 పరుగులు చేశాడు. సూర్య ఔట్ అయిన తర్వాత 41 పరుగుల వద్ద కెమరూన్ గ్రీన్‌ ను అవుట్ చేశాడు. ముంబై తరఫున మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన గ్రీన్‌ ఆరంభం నుంచే ఫోర్లు, సిక్సర్ల విరుచుకుపడ్డాడు. గ్రీన్ 23 బంతుల్లో 178 స్ట్రైక్ రేట్‌తో 41 పరుగులతో సత్తా చాటాడు. అతను ఆరు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు.

Read More: LSG vs MI: డూ ఆర్ డై మ్యాచ్ లోనూ రోహిత్ విఫలం

Exit mobile version