Site icon HashtagU Telugu

Pawan Support over Chandrababu Arrest : పవన్ ధైర్యానికి హ్యాట్సాఫ్ – నట్టికుమార్

Natti Kumar Urges TFI To Support Chandrababu

Natti Kumar Urges TFI To Support Chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) ఫై చిత్రసీమ (Tollywood) స్పందించకపోవడం దారుణమని..కానీ పవన్ (Pawan Kalyan) ధైర్యం చేసి సపోర్ట్ ఇవ్వడం ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అన్నారు నిర్మాత నట్టికుమార్ (Producer Nattikumar). స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు (Chandrababu )ను రెండు వారాల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలు కు తరలించారు. ఇక చంద్రబాబు అరెస్ట్ చేయడం ఫై తెలుగు ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. మరోపక్క టీడీపీ శ్రేణులు ఏపీ వ్యాప్తంగా బంద్ లు , నిరసన లు తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత నట్టికుమార్..చంద్రబాబు అరెస్ట్ ఫై స్పందించారు. చంద్రబాబు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నానని, ప్రతిపక్షంలో కానీ అధికార పక్షంలో కానీ చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడు ఉంటే మంచిదన్నారు. చంద్రబాబు ఏ రోజు కక్షసాధింపు పనులు చేయలేదు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన అలాంటి వ్యక్తి జైలులో ఉండకూడదు. జనాల్లో ఉండాలి. ఆయనపై పెట్టిన కేసులలో నిజాలు ఉన్నాయా? లేవా? అన్న అంశాలను కోర్టులు చూసుకుంటాయి. అయితే చంద్రబాబు అరెస్టుపై తెలుగు సినీ పరిశ్రమ స్పందించకపోవడం నాకు చాలా బాధ కలిగించింది. జూనియర్‌ ఎన్టీఆర్‌ సహా చిరంజీవి (Chiranjeevi), మురళీమోహన్‌ (Murali Mohan), అశ్వనీదత్‌ (Producer Ashwini Dutt), రాజమౌళి (Rajamouli), దామోదరప్రసాద్‌ వంటి సినీ ప్రముఖులతో పాటు తుమ్మల ఇంటి పేరును నందమూరిలాగా ఫీలయ్యే నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్‌ కానీ ఇతర సినీ పరిశ్రమ పెద్దలెవరూ చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించకపోవడం దారుణమన్నారు.

Read Also : Krishnam Raju Death Anniversary: ప్రభాస్ కుటుంబంతో వైసీపీ రాజకీయాలు.. రోజా వాగ్దానాలు ఏమయ్యాయి?

టాలీవుడ్ లో చంద్రబాబు అభిమానులు, మద్దతుదారులు చాలామందే ఉన్నారు. వీరంతా కూడా చంద్రబాబు పదవిలో ఉన్నప్పుడు మాకు ఇవి కావాలి!…అవి కావాలి! అని లబ్ది పొందిన వారే. ప్రతీ సందర్భంలో సినీ పరిశ్రమ కోసం ముందుండే వ్యక్తిగా చంద్రబాబు పేరు సంపాదించుకున్నారు. ఓ వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడుగా అండగా ఉండటం మానవత్వం. చంద్రబాబుకు మద్దతుగా నిలబడితే జగన్‌ ఉరితీస్తాడా? చంద్రబాబు చేసిన సేవలను గౌరవించి ఆయనకు అండగా నిలబడాలి. తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌లో నందమూరి అభిమానులు ఏమైపోయారు. ఎందుకు స్పందించడం లేదు? అని నట్టి కుమార్‌ ప్రశ్నించారు. ఇదే సందర్బంగా పవన్ కళ్యాణ్ ఫై నట్టికుమార్ ప్రశంసలు కురిపించారు. పవన్‌ కళ్యాణ్‌ పెద్ద కొడుకుగా ముందడుగు వేసి మద్దతు ఇచ్చారని ..నిజంగా పవన్ కళ్యాణ్ కు ధైర్యానికి హ్యాట్సాఫ్ అన్నారు.