Site icon HashtagU Telugu

Ukraine Russia War: ఉక్రెయిన్‌కు షాక్ ఇచ్చిన నాటో.. ర‌ష్యాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లేనా..?

Nato Ukraine

Nato Ukraine

ఉక్రెయిన్ పై దండ‌యాత్ర సాగిస్తూ ఆ దేశంపై బాంబుల వర్షం కురిపిస్తూ విధ్వంసం సృష్టిస్తున్న రష్యా, తాత్కాలికంగా 5 గంట‌లు యుద్ధానికి బ్రేక్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఉద‌యం 11:30 గంటల యుద్ధ విరామాన్ని ప్ర‌క‌టించిన ర‌ష్యా, తిరిగి యధావిధిగా యుద్ధం ప్రారంభమవుతుందని తెలిపింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం అభ్యర్థన మేరకు రష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ దేశంలో చిక్కుకుపోయిన విదేశీయులను తరలించేందుకు ఈ విరామాన్ని ప్రకటిస్తున్నట్లు తెలిపింది.

ఇక మ‌రో షాకింగ్ మ్యాట‌ర్ ఏంటంటే ఉక్రెయిన్‌లో నో ఫ్లైజోన్ అమ‌లుకు నాటో (ఉత్తర అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) తిరస్క‌రించింది. ఉక్రెయిన్ పై ర‌ష్యా తీవ్రస్థాయిలో వైమానిక దాడులు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ఉక్రెయిన్‌లో నో ఫ్లైజోన్ అమలు చేయాలని జెలెన్ స్కీ నాటో సభ్య దేశాలను కోరారు. అయితే నో ఫ్లైజోన్ అమలు చేయాలనే జెలెన్ స్కీ ప్రతిపాదనను నాటో తిరస్కరించింది. అలా చేస్తే ఐరోపాలో పెను యుద్ధానికి దారితీస్తుందన్న నాటో హెచ్చరిస్తోంది. ఈ క్ర‌మంలో ఉక్రెయిన్ గగనతలంలో నో ఫ్లై జోన్ ఏర్పాటుకు తిరస్కరించినందుకు నాటో పై జెలెన్ స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటో నిర్ణయంతో ఉక్రెయిన్ పై మరింత బాంబు దాడి చేసేందుకు ర‌ష్యాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అవుతుందని జెలెన్ స్కీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version